Homeఆదిలాబాద్Theft | మల్లన్న గుట్ట హరిహర క్షేత్రంలో భారీ చోరీ.

Theft | మల్లన్న గుట్ట హరిహర క్షేత్రంలో భారీ చోరీ.

నిర్మల్ జిల్లా కేంద్రంలోని మల్లన్న గుట్ట హరిహర క్షేత్రంలోనీ ఉప ఆలయాలైన సుబ్రమణ్య స్వామి, గణపతి, అమ్మవారి ఆలయంలో నిన్న అర్ధరాత్రి చోరీ జరిగిన ఘటన చోటుచేసుకుంది. ఆలయ కోశాధికారి వేణుగోపాల్ తెలిపిన వివరాల ప్రకారం నిన్న అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు ఆలయంలోకి ప్రవేశించి దాదాపు 10 నుంచి 11కిలోల వెండి, 2 తులాల బంగారు ఆభరణాలు దుండగులు అపహరించారన్నారు. ఎప్పటిలాగే అర్చకులు ఆలయంలోకి వచ్చేసరికి ఆలయ తలుపులు తీసి సామాగ్రి చిందరవందరగా ఉన్నట్లు గమనించి పోలీసులకు సమాచారాన్ని తెలపడం జరిగిందన్నారు. ఈ మేరకు డి.ఎస్.పి శ్రీనివాస్ ఘటన స్థలానికి చేరుకొని క్లూస్ టీం బృందంతో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News