Homeవరంగల్‌Honour | అధికారులకు సర్పంచ్ విజయ అశోక్ సన్మానం.

Honour | అధికారులకు సర్పంచ్ విజయ అశోక్ సన్మానం.

వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచిగా గెలుపొందిన గోపనపల్లి గ్రామ నూతన సర్పంచ్ నాంపల్లి విజయ అశోక్ దంపతులు, స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి పర్వతగిరి మండల తహసీల్దార్ టీ. వెంకటస్వామి, ఆర్.ఐ భారతి, జిపిఓ అరుణ్ లను మర్యాద పూర్వకంగా కలసి శాలువాతో సత్కరించారు.

Gopanapalli Sarpanch Vijaya Ashok Felicitates Officials 1

కొత్తగా ఎన్నికైన సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ మండల, జిల్లా నాయకుల సూచన మేరకు ఆయా శాఖల అధికారులను కలుస్తూ పరిచయాలను పెంచుకుంటూ గ్రామ సమస్యల సాధనకు సహకారం అందించాలని అధికారులను కోరినట్లు సర్పంచ్ విజయ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు మిట్టపల్లి నాగార్జున, యూత్ అధ్యక్షుడు కారింగుల రాము, కార్యకర్తలు బెల్లం కుమారస్వామి, గొల్లపల్లి తిరుపతి, ఆకుల సతీష్, జన్ను నర్సయ్య, గొల్లపల్లి శ్రీధర్, బోయినీ రవికుమార్, భాషిపాక రాజు, బెల్లం కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.

Gopanapalli Sarpanch Vijaya Ashok Felicitates Officials 2
Gopanapalli Sarpanch Vijaya Ashok Felicitates Officials 23.jpg 4
- Advertisement -
RELATED ARTICLES

Latest News