- భర్త గొంతు పిసికి ఆత్మహత్యగా చిత్రీకరణ…Venkatapuram Murder Case
వివాహేతర సంబంధం ఓ వ్యక్తి మరణానికి దారితీసింది… వెంకటాపురం ఎస్ఐ తిరుపతిరావు కథనం ప్రకారం….Venkatapuram Murder Case
మండల పరిధిలోని బీసీ మర్రిగూడెం పంచాయతీలోని డబల్ బెడ్ రూమ్ కాలనీలో నివాసం ఉంటున్న పూనెం నాగరాజు(31) ఆటో డ్రైవర్ గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. నాగరాజు భార్య గత మూడు సంవత్సరాలుగా బెస్తగూడెం గ్రామానికి చెందిన గుండారపు సత్యంతో అక్రమ సంబంధం కొనసాగిస్తుంది.

ఈ విషయమై కుటుంబంలో తరచూ గొడవలు జరుగుతున్నాయి. బుధవారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో భార్యాభర్తలు ఇద్దరు గొడవ పడుతున్న సమయంలో సమాచారాన్ని తెలుసుకున్న గుండారపు సత్యం అక్కడకు చేరుకున్నాడు. ఆ సమయంలో వారి వద్ద జరిగిన పెనుగులాటలో భార్య నాగజ్యోతి గుండారపు సత్యంతో కలిసి గొంతు పిసికి చంపింది. భర్తను మరణంతో ఈ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు వారిద్దరు ప్రయత్నించారు.
అదే సమయంలో 108కు ఫోన్ చేసి ఆసుపత్రికి తరలించి ఫిట్స్ వచ్చినట్లుగా చెప్పారు. నాగరాజు పరీక్షించిన రైతుల అప్పటికే చెందాడని తెలిపారు. మృతదేహాన్ని మార్చరీలో చూసిన అతడి సోదరుడు మృతుడి శరీరంపై, మెడ చుట్టూ గాయాలు ఉండడంతో మృతుడి సోదరుడు పూనం వెంకట నరసింహారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇద్దరినీ విచారించగా చేసిన నేరాన్ని వారు ఒప్పుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకొని విజనగ జరుగుతున్నట్లు తెలిపారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
