Homeవరంగల్‌Government Land | భూ రీసర్వేలో ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలి...

Government Land | భూ రీసర్వేలో ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలి…

  • రాష్ట్ర ప్రచార కార్యదర్శి రేగ గణేష్…Government Land

వెంకటాపురం మండలంలోని ఆక్రమణలకు గురైన ప్రభుత్వములను (Government Land) స్వాధీనం చేసుకోవాలని ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ రాష్ట్ర ప్రచార కార్యదర్శి రేగ గణేష్ అన్నారు. గురువారం భూ రీసర్వే జరుగుతున్న సుడిబాక గ్రామానికి వచ్చిన ఆర్డీవో కృష్ణవేణికి ఫిర్యాదులతో కూడిన వినతి పత్రాన్ని సంఘం ఆధ్వర్యంలో అందించారు. అనంతరం గణేష్ మాట్లాడుతూ.. మండలంలో ఈ ప్రాంతానికి అక్రమంగా వలస వచ్చిన గిరిజనేతరులు అక్రమంగా ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నారని తెలిపారు.

ఆ భూములపై సమగ్ర సర్వే నిర్వహించి, గిరిజన చట్టాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ భూములను రక్షించాలని కోరారు. సర్వేలో గిరిజనేతరుల పేర్లను రికార్డులలో నమోదు చేయవద్దని, వాటిని ప్రభుత్వ భూములుగానే గుర్తించాలని తెలిపారు. క్రింది స్థాయి అధికారులు ఏజెన్సీ చట్టాలకు లోబడి పనిచేయాలని అన్నారు. గతంలో కూడా ప్రభుత్వ భూములకు సంబంధించిన ప్రభుత్వ భూముల ఆక్రమణలను, కొన్ని అక్రమ పట్టాలను గూర్చి ఫిర్యాదు ఇచ్చామని అన్నారు. వాటిని ఆలస్యం లేకుండా చర్యలకు ఆదేశించాలని కోరారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పూనెం చంటి, సీనియర్ నాయకులు పూనెం మునేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES

Latest News