కంకర లోడుతో ఉన్న టిప్పర్ లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందిన డ్రైవర్… రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద హైదరాబాద్ – బీజాపూర్ రహదారిపై, కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ లారీని ఢీకొన్న తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు…
డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందగా, తీవ్ర గాయాలపాలైన పలువురు ప్రయాణికులు… బస్సులో కంకర పడడంతో కంకర కింద కూరుకుపోయిన మరికొంతమంది ప్రయాణికులు… ప్రమాద సమయంలో బస్సులో 70 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం…
క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు, స్థానికులు… ఈ ప్రమాదంలో డ్రైవర్ తో పాటు, 17 మంది మరణించినట్లు సమాచారం… మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుపుతున్న అధికారులు..




