- యూత్‌ఫుల్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను అలరించనుంది – హీరో సందీప్ అశ్వ
హైదరాబాద్, సంపంగి, 16 వంటి చిత్రాలకు చార్ట్‌బస్టర్ సంగీతాన్ని అందించిన దర్శకుడు, సంగీత దర్శకుడు ఘంటాడి కృష్ణ స్వీయ నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం ‘రిస్క్’ ట్రైలర్‌ను ఘనంగా విడుదల చేశారు. హీరో సందీప్ అశ్వ, హీరోయిన్ సన్యా ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని జూన్ రెండో వారంలో విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు ఎమ్మెల్సీ మధుసూదనాచారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మధుసూదనాచారి మాట్లాడుతూ, “‘రిస్క్’ టైటిల్ చాలా ఆకర్షణీయంగా ఉంది. ట్రైలర్ చూసిన తర్వాత సినిమా థియేటర్‌లో చూడాలనే ఆసక్తి కలిగింది. యువతకు బాగా నచ్చే అంశాలతో సినిమా రూపొందినట్లు కనిపిస్తోంది. ట్రైలర్‌లో విజువల్స్, ఉత్కంఠ, థ్రిల్ ఆకట్టుకున్నాయి. చిత్రబృందానికి అభినందనలు” అన్నారు.
హీరో సందీప్ అశ్వ మాట్లాడుతూ, “చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఎంతో ఇష్టం. చిన్న మ్యూజిక్ వీడియోలు, షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ ఇక్కడి వరకు వచ్చాను. వెండితెరపై నన్ను చూసుకోవడానికి దాదాపు పదేళ్లు పట్టింది. ‘రిస్క్’ నా కెరీర్‌లో ప్రత్యేకమైన సినిమా. ప్రేమ, ఎమోషన్, యాక్షన్, కామెడీ, థ్రిల్ అన్నీ కలగలిసిన యూత్‌ఫుల్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ ఇది. ఫస్ట్ హాఫ్‌లో ఫ్రెండ్‌షిప్, లవ్, కామెడీ ఉంటే.. సెకండ్ హాఫ్ థ్రిల్లింగ్‌గా సాగుతుంది. ప్రేక్షకులు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు” అన్నారు.
దర్శకుడు, సంగీత దర్శకుడు ఘంటాడి కృష్ణ మాట్లాడుతూ, “‘సంపంగి’, ‘16’ వంటి చిత్రాల పాటలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాను. దర్శకుడిగా ఇది నా తొలి చిత్రం. మొదట ఈ సినిమాకు ‘16-2’ అనే టైటిల్ అనుకున్నాం. అయితే హీరో సందీప్ సూచనతో ‘రిస్క్’ అనే టైటిల్ ఖరారు చేశాం. సందీప్ ఎంతో అంకితభావంతో పనిచేశారు. సంగీతపరంగా, కథాపరంగా సినిమా ప్రేక్షకులకు దగ్గరవుతుందని నమ్ముతున్నాం” అని తెలిపారు.
నటుడు 30 ఇయర్స్ పృథ్వి మాట్లాడుతూ, ఘంటాడి కృష్ణ అందించిన పాటలు ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తున్నాయని, ట్రైలర్ ఆకట్టుకునేలా ఉందని పేర్కొన్నారు. మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ, సినిమా టైటిల్‌కు తగ్గట్టుగానే ఆసక్తికరమైన కథతో పాటు టెక్నికల్‌గా కూడా సినిమా మెప్పించేలా ఉందని అన్నారు.
నటి ఆషు రెడ్డి మాట్లాడుతూ, ట్రైలర్ ఆసక్తిని రేకెత్తించిందని, సందీప్ కష్టానికి మంచి ఫలితం దక్కాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో చిత్రబృందం సభ్యులు పాల్గొన్నారు.
తారాగణం: సందీప్ అశ్వ, సన్యా ఠాకూర్, జోయా జవేరి, రాజీవ్ కనకాల, అనీష్ కురువిల్లా, తరుణ్ సాగర్, రవీంద్రనాథ్ ఠాగూర్ తదితరులు.
దర్శకత్వం & సంగీతం: ఘంటాడి కృష్ణ
నిర్మాతలు: గుర్రం నర్సింహులు, రావి సురేష్ రెడ్డి, ఘంటాడి కృష్ణ
బ్యానర్: GK మిరాకిల్స్
డీవోపీ: జగదీష్ కొమారి
ఎడిటర్: శివ శరణ్
స్టంట్స్: శంకర్ మాస్టర్
కొరియోగ్రఫీ: రఘు, విజయ్ పోలాకి
