భలే భలే సిగరెట్టు ఇది దొరలు తాగు సిగరెట్టు..
అని ఓ సినీ కవి సెలవిచ్చాడు.. గుండెల నిండా పొగ
పీలుస్తూ.. రింగు రింగులుగా పొగ వదుల్తూ..
ఫోజులు కొడుతుంటారు.. కానీ అదే పొగ తమ
గుండెకు చిల్లులు పెడుతుందని
గ్రహించలేకపోతున్నారు.. తెలిసితెలిసీ జీవితాలను
నాశనం చేసుకుంటున్నారు.. పొగాకు ఉత్పత్తులపై
నిషేధం అంటూ ప్రభుత్వాలు ఊదరగొడుతున్నా..
వాస్తవ పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయి.. తమ
ఖజానా నిండుతుందని చూస్తున్నారు తప్ప.. తప్పు
చేస్తున్నామనే భావన కనిపించడం లేదు.. ఒకరు
చెబితేనో.. ఒకరు సూచిస్తేనో.. మార్పురావడం
అన్నది కల్ల.. ఎవరికీ వారు మేలుకోవాలి.. తమను
తాము రక్షించుకోవడంతో పాటు.. భవిష్యత్
తరాలను కూడా రక్షించాలి.. నేడు ప్రపంచ పొగాగు
వ్యతిరేక దినం.. ఈ క్షణం నుంచే ప్రతిజ్ఞ పూనండి..
పొగాకురహిత సొసైటీని స్థాపించండి..
Aaj Ki Baath | పొగలో కాలిపోతున్న జీవితాలు
- Advertisement -
RELATED ARTICLES
