Saturday, April 25, 2026
HomeరాజకీయంSatire | జగన్‌ని చూస్తే జాలేస్తోంది

Satire | జగన్‌ని చూస్తే జాలేస్తోంది

ఎద్దేవా చేసిన రఘురామకృష్ణరాజు

రాజకీయాల్లో హత్యలుండవని, ఆత్మహత్యలే ఉంటాయని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు. నేరగాళ్లను పరామర్శించటం ద్వారా జగన్ దిగజారుడు ఓట్ల రాజకీయంలో పరాకాష్ఠకు చేరుకున్నారని ఎద్దేవా చేశారు. పొలిటికల్‌‌గా ఆయన సూసైడ్ చేసుకున్నారని విమర్శించారు. పోలీసులపై హత్యాయత్నం చేసిన నిందితులకు జగన్ సపోర్ట్ చేయటం విడ్డూరంగా ఉందని చెప్పారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్‌లో పెట్టి సునీల్ కుమార్ అనే అధికారితో కొట్టించింది జగనే అని ఆరోపించారు. ఆయన్ని చూస్తే తనకు జాలేస్తోందని రఘురామకృష్ణరాజు జగన్‌పై సెటైర్ వేశారు. తెనాలిలో పోలీసులు యువకులను నడిరోడ్డుపై కర్రతో కొట్టిన విషయం తెలిసిందే. ఆ యువకుల కుటుంబాలను జగన్ పరామర్శించి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రఘురామకృష్ణరాజు కౌంటర్ ఇచ్చారు.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES

Latest News