Homeనల్లగొండSaree Distribution | ఘనంగా మహిళలకు చీరల పంపిణీ

Saree Distribution | ఘనంగా మహిళలకు చీరల పంపిణీ

వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా మఠంపల్లి మండలంలోని పెదవీడు గ్రామానికి చెందిన నవ చైతన్య యూత్ ఆధ్వర్యంలో శుక్రవారం మహిళలకు చీరల పంపిణీ(Saree Distribution) కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా మహిళలకు చీరలు అందజేయడం ద్వారా భక్తి, సేవాభావంతో పాటు సామాజిక ఐక్యతను చాటుకున్నారు.ఈ సందర్భంగా మహిళలకు చీరలను పంపిణీ(Saree Distribution) చేసి, వినాయక చవితి ఉత్సవాల విశిష్టతను వివరించారు.వినాయక చవితి ఉత్సవాలను కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమాలకే పరిమితం చేయకుండా,సేవా గుణంతో యూత్ సభ్యులు నిర్వహించడం అభినందనీయమని స్థానిక సర్పంచ్ అమరారపు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.

యువత సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండటం ద్వారా గ్రామంలో స్ఫూర్తిదాయక వాతావరణాన్ని నెలకొల్పుతున్నారని ఉప సర్పంచ్ మల్ రెడ్డి త్రివేణి కోటీ రెడ్డి తెలిపారు.అనంతరం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ప్రముఖులను నవ చైతన్య యూత్ ఉత్సవ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షుడు బొంత శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాలను మున్ముందు గ్రామ ప్రజల సహకారంతో ఘనంగా నిర్వహించేందుకు కృషి చేస్తామని తెలిపారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్,ఉప సర్పంచ్ వెంట వైఎస్ఆర్ రెస్టారెంట్ ఓనర్ రాజీవ్ రెడ్డి,అడ్వకేట్ మద్దుల నాగేశ్వర్ రావు,నవ చైతన్య యూత్ అధ్యక్షుడు బొంత శ్రీకాంత్ రెడ్డి,జిల్లా రజక సంఘం నాయకులు సైదులు,నవ చైతన్య యూత్ సభ్యులు,మహిళలు,గ్రామ పెద్దలు,యువకులు తదితరులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/), (Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News