మఠంపల్లి: మఠంపల్లి మండలంలోని చెన్నాయిపాలెం గ్రామ(Chennaipalem Village) ప్రభుత్వ చౌక ధరల దుకాణం నంబర్ 32 డీలర్ భూక్యా అనిత(Bhukya Anitha)పై సస్పెన్షన్ వేటు(Ration Dealer Suspended) పడింది. రేషన్ దుకాణం నిర్వహణలో భాగంగా డీలర్ గ్రామంలో అందుబాటులో లేకపోవడం, లబ్ధిదారులకు రేషన్ సరుకుల పంపిణీలో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో హుజూర్నగర్ ఆర్డీఓ శ్రీనివాసులు ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు అధికారిక ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ నిర్వహించిన అధికారులు, సంబంధిత డీలర్ గ్రామంలో అందుబాటులో లేకపోవడంతో రేషన్ దుకాణం నిర్వహణలో ఇబ్బందులు ఏర్పడుతున్నట్లు గుర్తించినట్లు ఉత్తర్వుల్లో వెల్లడించారు.
అనంతరం మఠంపల్లి తహసీల్దార్ సమర్పించిన నివేదిక ఆధారంగా 32వ నంబర్ రేషన్ దుకాణం నిర్వహణపై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. భూక్యా అనితపై సస్పెన్షన్ చర్యల అనంతరం చెన్నాయిపాలెం గ్రామంలోని 8వ నంబర్ ప్రభుత్వ చౌక ధరల దుకాణం డీలర్ వడిత్య శ్రీనుకు 32వ నంబర్ దుకాణం అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఆర్డీఓ ఉత్తర్వులు జారీ చేశారు.దీంతో ఇకపై 32వ నంబర్ రేషన్ దుకాణం పరిధిలోని లబ్ధిదారులకు ప్రభుత్వం అందించే రేషన్ సరుకుల పంపిణీ బాధ్యతలను వడిత్య శ్రీను నిర్వహించనున్నారు. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రేషన్ పంపిణీ సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు.(https://epaper.aadabhyderabad.in/), (Youtube)
