Tuesday, May 5, 2026
Homeస్పోర్ట్స్Pakistan | ఐసీసీతో పెట్టుకుంటే ఇక అంతే

Pakistan | ఐసీసీతో పెట్టుకుంటే ఇక అంతే

టీ20 వరల్డ్ కప్‌(T20 World Cup)లో పాల్గొనాలా వద్దా అనే ఊగిసలాటలో ఉన్న పాకిస్థాన్‌పై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐసీసీ(ICC)తో పెట్టుకుంటే ఇక అంతేనని హెచ్చరిస్తున్నారు. బంగ్లాదేశ్‌(Bangladesh)కి సపోర్ట్ చేస్తే ఓకే గానీ ఆ నిర్ణయం వల్ల తమ దేశానికి నష్టం జరగకుండా చూసుకోవాలని పాకిస్థాన్ మాజీ ప్లేయర్లు(Ex-Players), పీసీబీ ఆఫీసర్లు(PCB Officers) సూచిస్తున్నారు. పాకిస్తాన్.. ప్రపంచ పాలక మండలి(ఐసీసీ)తో తన సంబంధాన్ని చెడగొట్టుకోకూడదని, బంగ్లాదేశ్‌కు మద్దతిచ్చే విషయంలో జాతీయ క్రికెట్‌ను పణంగా పెట్టకూడదని మాజీ ఆటగాళ్లు, బోర్డు అధికారులు ఏకగ్రీవంగా చెబుతున్నారు. రాబోయే T20 ప్రపంచ కప్‌లో పాల్గొనడంపై PCB తన నిర్ణయాన్ని వాయిదా వేసిన నేపథ్యంలో వాళ్లు స్పందించారు.

పాకిస్తాన్ జట్టును ప్రపంచ కప్‌కు పంపకపోవడానికి గల కారణమేంటో తమకు అంతుబట్టడంలేదని పాకిస్తాన్ మాజీ టెస్ట్ కెప్టెన్ ముహమ్మద్ హఫీజ్, పీసీబీ మాజీ చైర్మన్ ఖలీద్ మహమూద్, కార్యదర్శి ఆరిఫ్ అలీ అబ్బాసి అన్నారు. పాకిస్తాన్.. బంగ్లాదేశ్‌కు మద్దతిస్తోందనే సంగతిని తాను అర్థంచేసుకోగలనని, అయితే.. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌తో, సభ్య బోర్డులతో సంబంధాలను చెడగొట్టుకోవడంతోపాటు తన జట్టును పంపకపోవడం ద్వారా PCB ఏం సాధిస్తుందని అబ్బాసి ప్రశ్నించారు. శ్రీలంక(Srilanka)తో మన సంబంధాల సంగతేంటి? పాకిస్తాన్ వెళ్లకపోతే శ్రీలంక నష్టపోతుంది. ఎందుకంటే ఇండియాతోపాటు ఇతర దేశాలతో మనం ఆడాల్సిన మ్యాచ్‌లన్నీ శ్రీలంకలోనే జరుగుతాయి అని ఆయన గుర్తుచేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News