Tuesday, November 11, 2025
ePaper
Homeకరీంనగర్JubileeHills | పడాల రాహుల్‌కు ప్రచార బాధ్యతలు

JubileeHills | పడాల రాహుల్‌కు ప్రచార బాధ్యతలు

ఉత్తర్వులు జారీ చేసిన యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి సయ్యద్ ఖాలీద్ అహ్మద్

కరీంనగర్: జూబ్లీ హిల్స్ ఉపఎన్నిక(Bye Election)లో నవీన్ యాదవ్(Naveen Yadav) గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ (Congress Party) పలు చర్యలు చేపడుతోంది. జాతీయ యూత్ కాంగ్రెస్ (National Youth Congress) కార్యదర్శి సయ్యద్ ఖాలీద్‌ అహ్మద్‌తోపాటు పలువురు రాష్ట్ర యూత్ కాంగ్రెస్ నాయకులకు, కమిటీ సభ్యులకు ఎన్నికల ప్రచారానికి సంబంధించిన బాధ్యతలను అదనంగా అప్పగించారు. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో.. కరీంనగర్ జిల్లాకు చెందిన రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, జిల్లా ఆర్.టి.ఏ మెంబర్ పడాల రాహుల్ ఉన్నారు. ప్రచార కార్యకలాపాలను సజావుగా అమలుచేయడానికి నియమించిన ఈ కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు బి.మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) సారథ్యంలో, సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) నేతృత్వంలో, హైదరాబాద్ ఇన్‌ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం సమిష్టి కృషి చేయనున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News