- తెలంగాణలో పర్యటన:-ఎంపీ ఈటల రాజేందర్
దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈనెల 10వ తేదీన తెలంగాణ పర్యటనకు రానున్నారని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. ప్రధాని మోదీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణ పర్యటనకు రావడం ఇదే తొలిసారి కావడంతో ప్రజలు సభకు హాజరు కావాలని ఈటల పిలుపునిచ్చారు.
శుక్రవారం గుండ్లపోచంపల్లి డివిజన్ అధ్యక్షులు కావేరీ శ్రీధర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు పర్యటనలో భాగంగా సుమారు రూ.7,000 కోట్లకు పైగా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారని రైల్వే, జాతీయ రహదారులు, మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించిన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతో పాటు ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నట్లు ఈటల రాజేందర్ వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ప్రధాని పాల్గొనబోయే సభను జన ఆగ్రహ సభగా పేరు పెట్టడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు విక్రమ్ రెడ్డి, ప్రజా ఆగ్రహ సభ మేడ్చల్ జిల్లా ఇంచార్జి, అంజన్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి అమరం మోహన్ రెడ్డి, జిల్లా నాయకులు కృష్ణ గౌడ్, లక్ష్మారెడ్డి, మాజీ కౌన్సిలర్ల దొడ్ల మల్లికార్జును ముదిరాజ్, సముద్రాల హంసారాణి, డివిజన్ ఇంచార్జీ జగన్ గౌడ్, మాజీ ఎంపీటీసీలు ఉషిగారి శ్రీనివాస్ ముదిరాజ్, గడిల విష్ణువర్ధన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిలు కృష్ణ, రామారావు, బీజేపీ నాయకులు రవీందర్ గౌడ్, కిషన్, జంగా రెడ్డి, చెంచాల సురేష్,అర్జున్ బాబు, నవనీత, వెంకట్ గౌడ్, రాజు ముదిరాజ్, విక్రమ్, అభిలాష్ తదితరులు పాల్గొన్నారు.
