Homeరంగారెడ్డిDammaiguda | హాస్టల్‌లో విద్యార్థిపై దాడి.. కలకలం

Dammaiguda | హాస్టల్‌లో విద్యార్థిపై దాడి.. కలకలం

  • రాగింగ్ పేరిట కర్రలు, ప్లేట్లతో దాడి చేసిన తోటి విద్యార్థులు

దమ్మాయిగూడలోని శ్రీచైతన్య హైస్కూల్ హాస్టల్‌లో పదో తరగతి చదువుతున్న అభిషేక్ అనే విద్యార్థిపై తోటి విద్యార్థులు దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది. కామారెడ్డికి చెందిన అభిషేక్‌పై రాత్రి సమయంలో దాదాపు 12 మంది విద్యార్థులు రాగింగ్ పేరిట కర్రలు, ప్లేట్లతో దాడి చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బూట్లతో ముఖంపై తొక్కుతూ దాడి చేయడంతో విద్యార్థికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ప్రస్తుతం బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది.

మెట్లపై నుంచి పడిపోయాడంటూ తల్లిదండ్రులకు సమాచారం

అభిషేక్‌కు గాయాలు కావడంతో హాస్టల్ యాజమాన్యం తల్లిదండ్రులకు అతడు మెట్లపై నుంచి కిందపడిపోయినట్లు సమాచారం ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దాడి జరిగిన విషయాన్ని దాచిపెట్టేందుకు ప్రయత్నించారనే ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి.

- Advertisement -

హాస్టల్ భద్రతపై ప్రశ్నలు

రాత్రి సమయంలో ఇంతమంది విద్యార్థుల మధ్య గొడవ జరుగుతున్నా హాస్టల్ వార్డెన్, భద్రతా సిబ్బంది ఎందుకు గుర్తించలేకపోయారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విద్యార్థుల భద్రత, హాస్టల్‌లో పర్యవేక్షణపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న విద్యాసంస్థలు విద్యార్థులకు కనీస భద్రత కల్పించాల్సిన బాధ్యత ఉందని పలువురు పేర్కొంటున్నారు.

విద్యాశాఖ, పోలీసుల దృష్టి సారించాలి

ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు, పోలీసులు తక్షణమే విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని తల్లిదండ్రులు, విద్యార్థుల తల్లిదండ్రుల సంఘాలు కోరుతున్నాయి. దాడికి పాల్పడిన విద్యార్థులతో పాటు ఘటనపై యాజమాన్యం వ్యవహరించిన తీరుపైనా సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మైనర్ విద్యార్థుల విషయంలో చట్టపరమైన నిబంధనలను పాటిస్తూనే, ఇటువంటి హింసాత్మక ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వారు పేర్కొంటున్నారు

- Advertisement -
RELATED ARTICLES

Latest News