Tuesday, December 9, 2025
EPAPER
Homeహైదరాబాద్‌Unity | ముదిరాజ్ సమాజం ఐక్యంగా సాగితే హక్కుల సాధ్యమే

Unity | ముదిరాజ్ సమాజం ఐక్యంగా సాగితే హక్కుల సాధ్యమే

  • ముదిరాజ్ ఆత్మగౌరవ భవన నిర్మాణ దిశగా ముందడుగు..
  • మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన
  • తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్..
  • జాతీయ ముదిరాజ్ మహాసభ ప్రధాన కార్యదర్శి కాసాని వీరేష్ ముదిరాజ్
  • ముదిరాజ్ సంఘానికి సంబంధించిన అనేక అంశాలపై విస్తృత చర్చ
  • ముదిరాజ్ పెద్దల సంకల్పానికి సంపూర్ణ మద్దత్తు ఉంటుందని ప్రకటించిన ఈటల

తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్ , జాతీయ ముదిరాజ్ మహాసభ ప్రధాన కార్యదర్శి ,తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు కాసాని వీరేష్ ముదిరాజ్ మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు, మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి సమావేశమయ్యారు.ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘానికి సంబంధించిన అనేక ముఖ్యమైన అంశాలపై వారు విస్తృతంగా చర్చించడం జరిగింది..ముఖ్యంగా ముదిరాజ్ కులస్థులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను .. ముదిరాజ్ ఆత్మగౌరవ భవన్ నిర్మాణం,సమాజ అభివృద్ధికి అవసరమైన ప్రభుత్వ సహాయ సహకారాలు ..

వంటి కీలక విఅంశాలను బొర్రా జ్ఞానేశ్వర్ , కాసాని వీరేష్ ఎంపీ ఈటెల రాజేందర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమావేశంలో ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ,ముదిరాజ్ సమాజం ఐక్యంగా ముందుకు వస్తే హక్కుల సాధన సులభమవుతుందని స్పష్టం చేశారు..అంతేకాకుండా..ఆత్మగౌరవ భవన్ నిర్మాణానికి తాను పూర్తి సహకారం అందిస్తానని..ముదిరాజ్ కులస్థులను బీసీ -డి నుంచి బీసీ- ఏ కేటగిరీకి మార్చే ప్రతిపాదనను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు తాను మద్దతు తెలుపుతానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఉప్పరి నారాయణ ముదిరాజ్, చొప్పరి శంకర్ ముదిరాజ్, పిట్టల నగేష్ ముదిరాజ్,భీమ్ లక్ష్మణ్ ముదిరాజ్,వినోద్ ముదిరాజ్,గుండ్లపల్లి శ్రీను ముదిరాజ్,మెదక్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు పుట్టి రాజు ముదిరాజ్,రాజశేఖర్ ముదిరాజ్ తో పాటు పలువురు ముదిరాజ్ సంఘం పెద్దలు,రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES

Latest News