Wednesday, April 22, 2026
Homeబిజినెస్BSE | ఒక్క సెషన్‌లో రూ.6 లక్షల కోట్లు

BSE | ఒక్క సెషన్‌లో రూ.6 లక్షల కోట్లు

భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్

బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్(BSE)లో నమోదైన కంపెనీల మొత్తం మార్కెట్ విలువ ఈ రోజు ఒక్క సెషన్‌లోనే రూ.6 లక్షల కోట్లు పెరిగింది. తద్వారా రూ.475 లక్షల కోట్లుగా నమోదైంది. మన దేశ స్టాక్ మార్కెట్ (Stock Market) చానాళ్ల తర్వాత మంచి ర్యాలీ తీసింది. సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. ఇంటర్నేషనల్ మార్కెట్ (International Market) నుంచి సానుకూల సంకేతాలు (Positive Signals) రావటంతో సెన్సెక్స్ (Sensex) ఏకంగా వెయ్యి పాయింట్లు లాభపడింది. నిఫ్టీ(Nifty) 26,200 మార్క్‌ను అందుకుంది.

- Advertisement -

అమెరికా కేంద్ర బ్యాంక్ (America Central Bank) వడ్డీ రేట్లు తగ్గిస్తుందనే అంచనాలు బాగా కలిసొచ్చాయి. సెన్సెక్స్ పొద్దున స్వల్ప నష్టాలతో ప్రారంభమైనప్పటికీ కొద్దిసేపటికే లాభాల్లోకి వచ్చింది. రోజంతా ప్రాఫిట్స్‌తోనే కొనసాగింది. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 89.25గా ఉంది. సెన్సెక్స్‌ 30 ఇండెక్స్‌లోని ఎయిర్‌టెల్, ఏషియన్స్ పెయింట్స్ తప్ప మిగతావన్నీ లాభాల్లోనే ముగిశాయి. గ్లోబల్ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 62.21 డాలర్లుగా, ఔన్స్ గోల్డ్ 4159 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News