- జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డిని కోరిన ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి…
మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి(MLA Marri Rajashekar Reddy) గురువారం ఖైరతాబాద్‌లోని హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWSSB) ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి, జలమండలి(jalamandali) మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డిని(MD ashok reddy) మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో త్రాగునీరు సరఫరా లైన్లు, డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరించడం, పాత పైపులైన్ల మార్పిడి, కొత్త కాలనీలకు త్రాగునీరు, డ్రైనేజీ సౌకర్యాలు కల్పించడం వంటి అంశాలపై వివరంగా చర్చించినట్టు తెలిపారు.
దీనికి తోడు, స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించి, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు.జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి ఎమ్మెల్యే సూచనలను సానుకూలంగా స్వీకరించి, తగిన చర్యలు త్వరితగతిన ప్రారంభిస్తామని హామీ ఇచ్చినట్టు ఎమ్మెల్యే తెలిపారు.

