- నిండు ప్రాణం తీసుకున్న యువకుడు..
- అమెరికాలో తనువుచాలించిన కర్నూలుకు చెందిన చందు..
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధానాలతో ఉద్యోగం రాలేదని, ఇక రాబోదని మనస్థాపం చెంది కర్నూలు యువకుడు అమెరికాలో ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. కర్నూలు నగరంలోని గీతా నగర్ కాలనీకి చెందిన ఇరగనబోయిన చందు 26.. అమెరికాలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఎన్నో ఆశలతో అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం కోసం వెళ్లిన చందు.. బలవన్మరణానికి పాల్పడటంతో కుటుంబ సభ్యులు బంధుమిత్రులు విషాదంలో మునిగిపోయారు. విషయం తెలియగానే మంత్రి లోకేష్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
- Advertisement -
