Saturday, May 2, 2026
Homeఆరోగ్యంTips | సరైన పోషణతో జుట్టు రాలడం ఆపొచ్చు..

Tips | సరైన పోషణతో జుట్టు రాలడం ఆపొచ్చు..

  • ఒత్తిడి, పోషకాహార లోపమే కారణం..
  • తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్న నిపుణులౌ..

జుట్టు రాలడం అన్ని వయసుల వారిలో కనిపించే సాధారణ సమస్య. కొద్దిగా జుట్టు రాలడం సహజమే అయినప్పటికీ, అది ఎక్కువగా, తరచూ జరిగితే ఆందోళన కలిగించే అంశంగా మారుతుంది. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం వంటి కారణాలతోపాటు జీవనశైలి అలవాట్లు కూడా జుట్టు ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. జుట్టు రాలడానికి కొన్ని సైలెంట్ కారణాలు ఉంటాయి. ఇవి బయటికి వెంటనే కనిపించకపోయినా, లోపల శరీరంలో జరుగుతున్న మార్పులు జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

మొదటిది అధిక ఒత్తిడి. ఇది జుట్టు రాల‌డానికి ప్రధాన కారణ‌మ‌ని నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలిక స్ట్రెస్ వల్ల కార్టిసాల్ హార్మోన్ స్థాయిలు పెరుగుతాయి. ఇది జుట్టు రూట్స్‌ను విశ్రాంతి దశలోకి నెట్టేస్తుంది. గట్ మైక్రోబయోమ్ (మంచి బ్యాక్టీరియా) అసమతుల్యత వల్ల పోషకాలు శరీరానికి సరిగ్గా అందవు. దీని వల్ల జుట్టు వృద్ధికి అవసరమైన పోషణ తగ్గిపోతుంది. అలాగే శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ పెరిగి హెయిర్ ఫోలికల్స్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుంది. కెమికల్ ఓవర్‌లోడ్. హెయిర్ స్టైలింగ్ ప్రోడక్ట్స్, కఠిన రసాయనాలు ఎక్కువగా వాడటం వల్ల జుట్టు నిర్మాణం దెబ్బతింటుంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News