Homeక్రైమ్ వార్తలుJeedimetla | జీడిమెట్ల ఆర్టీసీ డిపోలో ఘోర ప్రమాదం..

Jeedimetla | జీడిమెట్ల ఆర్టీసీ డిపోలో ఘోర ప్రమాదం..

  • బస్సు చక్రాల కిందపడి నలిగిపోయిన ఉద్యోగి..
  • అలుముకున్న విషాధచాయలు..

హైదరాబాద్‌లోని మేడ్చల్ జిల్లా జీడిమెట్ల ఆర్టీసీ బస్ డిపోలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు కింద ఉండి మరమ్మతులు చేస్తున్న ఓ ఉద్యోగి, అదే బస్సు చక్రాల కింద నలిగి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటనతో డిపోలో విషాదఛాయలు అలముకున్నాయి.

వివరాల్లోకి వెళితే.. జీడిమెట్ల డిపోలో మెకానిక్‌గా పనిచేస్తున్న సంతోష్ కుమార్ (39), ఓ ఆర్టీసీ బస్సు బ్రేకుల్లో తలెత్తిన సమస్యను సరిచేసేందుకు వెళ్లారు. ఆయన బస్సు కింద ఉండి మరమ్మతులు చేస్తున్న విషయాన్ని గమనించని డ్రైవర్, ఒక్కసారిగా బస్సును ముందుకు కదిపారు. దీంతో సంతోష్ కుమార్ బస్సు చక్రాల కింద నలిగి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.

- Advertisement -

సమాచారం అందుకున్న జీడిమెట్ల పోలీసులు తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. తోటి ఉద్యోగి ఆకస్మిక మరణంతో డిపో సిబ్బంది దిగ్భ్రాంతికి గురయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News