Homeనల్లగొండKollu Mahidhar | జాతీయ స్థాయి ఎంఎస్‌ఆర్‌ సెంట్రల్‌ స్కూల్‌ విద్యార్థికి అవార్డు.

Kollu Mahidhar | జాతీయ స్థాయి ఎంఎస్‌ఆర్‌ సెంట్రల్‌ స్కూల్‌ విద్యార్థికి అవార్డు.

  • కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ చేతుల మీదుగా పురస్కారం అందుకున్న కొల్లు మహీధర్‌.

సూర్యాపేట: జాతీయ స్థాయి ఇన్‌స్పైర్‌ సైన్స్‌ ప్రాజెక్టుల పోటీల్లో సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలంలోని ఎంఎస్‌ఆర్‌ సెంట్రల్‌ స్కూల్‌ విద్యార్థి కొల్లు మహీధర్‌ ప్రతిభ(Kollu Mahidhar) చాటాడు. ప్రమాదాల నివారణకు హెచ్చరికలిచ్చే స్మార్ట్‌ స్టీరింగ్‌ ప్రాజెక్టుకు జాతీయ స్థాయి పురస్కారం అందుకున్నాడు.2023-24, 2024-25 విద్యా సంవత్సరాలకు సంబంధించి సుమారు 798 ప్రాజెక్టులను ఈ నెల 12 నుంచి 14 వరకు దిల్లీలోని భారత్‌ మండపంలో నిర్వహించిన జాతీయ సైన్స్‌ ఫెయిర్‌లో ప్రదర్శించారు.

వీటిలో 60 ప్రాజెక్టులను జాతీయ పురస్కారాలకు ఎంపిక చేశారు.బుధవారం దిల్లీలో జరిగిన ముగింపు కార్యక్రమంలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ చేతుల మీదుగా కొల్లు మహీధర్‌ అవార్డును అందుకున్నాడు.జాతీయ స్థాయిలో పురస్కారాలకు ఎంపికైన విద్యార్థులకు జపాన్‌లో జరిగే సకురా సైన్స్‌ ఎక్స్ఛేంజ్‌ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం లభించింది.ఈ సందర్భంగా అవార్డు గ్రహీత కొల్లు మహీధర్‌ను పాఠశాల ప్రిన్సిపల్‌ లక్ష్మీ రాజం, కరస్పాండెంట్‌ శ్రీనివాస్‌, చైర్మన్‌ కొల్లు మధుసూదన్‌ రావు, ఉపాధ్యాయ బృందం అభినందించారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News