Homeమెదక్‌Sadashivapet | వినతిపత్రాలు ఇచ్చినా కదలని అధికారులు..

Sadashivapet | వినతిపత్రాలు ఇచ్చినా కదలని అధికారులు..

  • ముళ్లకాంపగా గురునగర్ పార్కు!
    ​
    సదాశివపేట: ప్రజల సమస్యలపై ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా, రాతపూర్వకంగా వినతిపత్రాలు సమర్పించినా మున్సిపల్ అధికారుల్లో కనీస స్పందన కరువైంది. సదాశివపేట(Sadashivapet) పట్టణ పరిధిలోని గురునగర్ కాలనీ మున్సిపల్ పార్కు తీవ్ర దుస్థితికి చేరడంపై స్థానికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. గతంలోనే 10వ వార్డులోని వీధిదీపాలు, పారిశుధ్య లోపాలు, పార్కు అభివృద్ధిపై సాక్షాత్తు మున్సిపల్ కమిషనర్‌కే స్వయంగా వినతిపత్రం అందజేసినా అధికారులు కనీసం అటువైపు కన్నెత్తి కూడా చూడలేదని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. అధికారుల అలసత్వంతో సమస్యలు పరిష్కారం కాకపోగా మరింత జఠిలంగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

​పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని పంచాల్సిన మున్సిపల్ పార్కు ప్రస్తుతం పిచ్చిచెట్లు, ముళ్లపొదలతో చిట్టడవిని తలపిస్తోంది. స్థానికులు వాకింగ్, వ్యాయామం చేసుకునేందుకు వీల్లేకుండా నడక దారి (వాకింగ్ ట్రాక్) పూర్తిగా ధ్వంసమైంది. దీనితో ఉదయం, సాయంత్రం వేళల్లో వృద్ధులు, మహిళలు నడవడానికే భయపడుతున్నారు. మరోవైపు పిల్లలు ఆడుకునే ఆట పరికరాలు విరిగిపోయి, తుప్పుపట్టి ప్రమాదకరంగా మారడంతో చిన్నారులకు ఏ క్షణాన ఏం జరుగుతుందోనని తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

​అధికారులకు ఎన్నిసార్లు వినతులు ఇచ్చినా పట్టించుకోకపోవడం తగదని, ఇప్పటికైనా మున్సిపల్ యంత్రాంగం, స్థానిక ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించాలని కోరుతున్నారు. తక్షణమే పార్కులో పెరిగిన పిచ్చిమొక్కలను తొలగించి, అవసరమైన మరమ్మతులు చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కాలనీవాసులు కోరుతున్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News