HomeసినిమాKJQ | ఆగస్టు 7న రిలీజ్ కానున్న 'కింగ్ జాకీ క్వీన్'

KJQ | ఆగస్టు 7న రిలీజ్ కానున్న ‘కింగ్ జాకీ క్వీన్’

విభిన్న కథాంశాలతో విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్ విజయాలను అందుకుంటున్న నిర్మాత సుధాకర్ చెరుకూరికి తన ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్ నుంచి మరో ఆసక్తికరమైన చిత్రం #KJQ – King Jackie Queen ప్రేక్షకుల ముందుకు రానుంది. 1990ల కాలం నేపథ్యంలో సాగే పీరియడ్ క్రైమ్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో ‘దసరా’, ‘ది గర్ల్‌ఫ్రెండ్’ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న దీక్షిత్ శెట్టి హీరోగా నటిస్తున్నారు. ఆయనకు జోడీగా నూతన నటి శశి ఓదెల పరిచయం అవుతుండగా, యుక్తి తరేజా మరో కీలక పాత్రలో కనిపించనున్నారు.

ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన కేకే గత ఏడాది కన్నుమూశారు. ఆయన సినిమాపై ఉన్న పాషన్, విజన్ కి నివాళిగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఇప్పటికే వినూత్నమైన టైటిల్, ఆకట్టుకునే ఫస్ట్ లుక్ పోస్టర్, పవర్‌ఫుల్ టీజర్‌తో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

- Advertisement -
KJQ King Jackie Queen Release Date Announced

తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. ‘కేజేక్యూ – కింగ్ జాకీ క్వీన్’ ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ పోస్టర్‌లో ముగ్గురు ప్రధాన పాత్రలను స్ప్లిట్ ఫ్రేమ్‌లో చూపించారు. మధ్యలో శశి ఓదెల ఇంటెన్స్ లుక్ లో ఆకట్టుకోగా, తుపాకీ గురిపెట్టి కనిపిస్తున్న దీక్షిత్ శెట్టి పాత్ర ఆకట్టుకుంది. కుడివైపు చేతిలో సిగరెట్‌తో యుక్తి తరేజా కనిపిస్తూ తన పాత్రలోని మిస్టరీని సూచిస్తున్నారు.

ఈ చిత్రానికి నాగేశ్ బనెల్ సినిమాటోగ్రఫీ అందించగా, పూర్ణచంద్ర తేజస్వి సంగీతం సమకూరుస్తున్నారు. శ్రవణ్ కటికనేని ఎడిటర్‌గా, శ్రీకాంత్ రామిశెట్టి ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు.

రిలీజ్ డేట్ ప్రకటించిన సందర్భంగా మేకర్స్ ఇకపై సినిమా ప్రమోషన్స్‌ను మరింత వేగవంతం చేయడానికి సిద్ధమవుతున్నారు.

తారాగణం: దీక్షిత్ శెట్టి, శశి ఓదెల, యుక్తి తరేజా

సాంకేతిక సిబ్బంది:
బ్యానర్ – SLV సినిమాస్
నిర్మాత – సుధాకర్ చెరుకూరి
దర్శకత్వం – కెకె
సినిమాటోగ్రఫీ – నగేష్ బానెల్
సంగీతం – పూర్ణచంద్ర తేజస్వి
ఎడిటర్ – శ్రవణ్ కటికనేని
ప్రొడక్షన్ డిజైనర్ – శ్రీకాంత్ రామిశెట్టి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – శేఖర్ యలమంచిలి
PRO: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో

- Advertisement -
RELATED ARTICLES

Latest News