Homeరంగారెడ్డిAbdullapurmet | తెలంగాణ గిరిజన సమాఖ్య మండల కమిటీ ఎన్నిక

Abdullapurmet | తెలంగాణ గిరిజన సమాఖ్య మండల కమిటీ ఎన్నిక

తెలంగాణ గిరిజన సమాఖ్య అబ్దుల్లాపూర్మెట్ మండల నూతన కమిటీని శుక్రవారం నాడు ఎన్నుకున్నారు. రావి నారాయణ రెడ్డి కాలనీ ఫెజ్ 2 సిపిఐ పార్టీ కార్యాలయంలో సిపిఐ అబ్దుల్లాపూర్ మెట్ మండల కార్యదర్శి అజ్మీరా హరిసింగ్ నాయక్ అధ్యక్షతన జరిగిన నిర్మాణ మహా సభకి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కామ్రేడ్ ముత్యాల యాదిరెడ్డి హాజరై నూతన కమిటీని ప్రకటించారు.

తెలంగాణ గిరిజన సమైక్య అబ్దుల్లాపూర్ పెట్టు మండల నూతన అధ్యక్షులుగా బాణావత్ వెంకట్ నాయక్ ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. గౌరవ అధ్యక్షులుగా మూడవత్ లోక్య, ఉపాధ్యక్షులుగా వంశీ, శ్రీనివాస్, సరిలాల్, కార్యదర్శిగా లావుడ్య శంకర్, సహాయ కార్యదర్శులుగా అంగీడి అశోక్, సూర్య, కోశాధికారిగా లచ్చు నాయక్, కార్యవర్గ సభ్యులుగా సురేష్, క్రాంతి, దేవరాజ్, ఇస్లావత్, దాస్, రాజు, బద్రు, ప్రియా, తిరుపతి, విజయ్, శ్రీదేవి, జ్యోతి, శ్రీను తదితరులు ఎన్నికయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News