HomeసినిమాSamantha | మాతృత్వపు మధురిమల మధ్య సమంత..

Samantha | మాతృత్వపు మధురిమల మధ్య సమంత..

  • పండంటి మొగ బిడ్డకు జన్మనిచ్చిన నటి..Samantha
  • సోషల్ మీడియా ద్వారా పంచుకున్న భర్త రాజ్..

ప్రముఖ నటి సమంత (Samantha) మాతృత్వపు మధురిమలను ఆస్వాదిస్తున్నారు. ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని సమంత, ఆమె భర్త, ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరు స్వయంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. బాబు చిన్ని వేళ్లు సమంత వేలిని పట్టుకున్న అపురూపమైన చిత్రాన్ని పంచుకుంటూ తమ కుమారుడి పేరును ‘దేవ్ నిడిమోరు’గా ఖరారు చేసినట్లు ప్రకటించారు. 2026 నవంబరు 19న తమ బాబు జన్మించాడని, ఈ సమయం తమ జీవితంలోనే అత్యంత ఆనందకరమైన క్షణమని ఈ జంట భావోద్వేగంతో రాసుకొచ్చారు.

బాబు రాకకు ముందే, నవంబరు 17న వీరి ఇంట్లో కుటుంబ సభ్యుల సమక్షంలో సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. తల్లీబిడ్డల ఆరోగ్యం, సుఖ ప్రసవం కోసం ‘మాతృ శిశు మంగళ ఆశీర్వాదం’ పేరుతో వేడుక జరిగింది. ఈ పూజలో సమంత ఎరుపు రంగు సాంప్రదాయ దుస్తుల్లో మెరవగా, రాజ్ క్రీమ్ కలర్ కుర్తా, తెల్లటి పైజామాలో కనిపించారు. కుటుంబ పెద్దల ఆశీర్వాదం తీసుకుంటూ, శ్రీసూక్తం, గాయత్రీ దేవి హోమంలో వారు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News