Monday, May 11, 2026
Homeక్రైమ్ వార్తలుArrest | మత్తుమందు కలిపిన జ్యూస్ తాగించి అత్యాచారం..

Arrest | మత్తుమందు కలిపిన జ్యూస్ తాగించి అత్యాచారం..

  • ఆటో డ్రైవర్ చేసిన ఘాతుకం..
  • వీడియో తీసి బెదిరించిన వైనం..

తరచుగా ఆటోలో ప్రయాణించే పొరుగింటి మహిళకు మత్తుమందు కలిపిన జ్యూస్‌ను డ్రైవర్‌ ఇచ్చాడు. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిని వీడియో రికార్డ్‌ చేశాడు. ఆ మహిళను బెదిరించి పలుమార్లు లైంగికంగా వేధించాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు అతడ్ని అరెస్ట్‌ చేశారు. కేరళంలోని పతనంతిట్ట జిల్లాలో ఈ సంఘటన జరిగింది.

అడూర్‌లో నివసించే వినోద్‌ ఆటో నడుపుతూ జీవిస్తున్నాడు. పొరుగున నివసించే 28 ఏళ్ల మహిళ తరచుగా అతడి ఆటోలో ప్రయాణించేది. కాగా, భర్తకు దూరంగా ఉంటున్న ఆ మహిళపై వినోద్‌ కన్నుపడింది. ఫిబ్రవరిలో మత్తుమందు కలిపిన జ్యూస్‌ ఆమెతో తాగించాడు. ఆ తర్వాత ఆ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దానిని వీడియో రికార్డ్‌ చేశాడు. ఆమెను బెదిరించి పలుమార్లు లైంగికంగా వేధించాడు.

- Advertisement -

మరోవైపు ఆ వీడియో క్లిప్‌ను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తానని ఆ మహిళను వినోద్‌ బెదిరించసాగాడు. ఈ నేపథ్యంలో ఈ విషయాన్ని తన భర్తకు ఆమె చెప్పింది. ఇది తెలుసుకున్న వినోద్‌ ఆగ్రహంతో ఆ మహిళను కొట్టాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. అయితే తనపై కేసు నమోదైనట్లు తెలుసుకున్న వినోద్‌ పారిపోయాడు. చివరకు నిందితుడ్ని అరెస్ట్‌ చేసినట్లు పోలీస్‌ అధికారి తెలిపారు. అతడ్ని ప్రశ్నించి డిజిటల్‌ ఆధారాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఆ తర్వాత నిందితుడ్ని కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్‌కు తరలిస్తామని వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News