Sunday, June 21, 2026
Homeభక్తిKusumanchi | అద్వితీయ శివాలయం..

Kusumanchi | అద్వితీయ శివాలయం..

  • ఖమ్మం జిల్లాలో వెలసిన కూసుమంచి శివాలయం..

మహాదేవుడు వెలసిన ఆలయాలు తెలుగు రాష్ట్రాల్లో కోకొల్లలుగా ఉన్నప్పటికీ కొన్ని ఆలయాల చారిత్రక నేపథ్యం కారణంగా అవి ఎంతో ప్రసిద్ధి చెందాయి. పిలిస్తే పలికే దైవం శివుడు. కాసిని నీళ్లతో అభిషేకం చేస్తే చాలు వరాలిచ్చే దైవం భోళాశంకరుడు. తన భక్తులను ఆపదల నుంచి గట్టెక్కించే ఈశ్వరునికి ఎందరో రాజులు ఆలయాలు నిర్మించి తమ భక్తిని చాటుకున్నారు. అలంటి ఓ చారిత్రక ప్రసిద్ధి చెందిన ఓ ఆలయం గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

కాకతీయుల కాలంలో శివాలయాల నిర్మాణం విస్తృతంగా జరిగింది. కాకతీయ రాజులు శివ భక్తులు కావడంతో, అనేక ప్రాంతాల్లో శివాలయాలను నిర్మించి ఆ ఈశ్వరునిపై తమ భక్తి శ్రద్ధలను చాటుకున్నారు. కాకతీయులు శివాలయాలను, ఆ ఆలయాల్లో ప్రతిష్టించిన శివలింగాలను తమ దైన శైలిలో రూపొందించారు. అందువలన ఆ ఆలయాలను చూడగానే అవి కాకతీయుల కాలం నాటివని చెప్పవచ్చు. ఆ విధంగా కాకతీయుల నిర్మాణశైలిలో ఆకట్టుకునే శివాలయమే కూసుమంచి శివాలయం. అలనాటి కాకతీయుల వైభవాన్ని చాటే ఈ ఆలయ విశేషాలు చూద్దాం.

- Advertisement -

కాకతీయులు నిర్మించిన ఆలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగా ఈనాటికీ విరాజిల్లుతున్నాయి. అలాంటి క్షేత్రాలలో తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో వెలసిన ‘కూసుమంచి’ శివాలయం కూడా ఒకటి. ఈ ఆలయాన్ని గణపతిదేవుడు నిర్మించినట్టు ఆలయంలో లభించే శాసనాల ఆధారంగా తెలుస్తోంది. కూసుమంచి రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని 11-12వ శతాబ్దంలో కాకతీయ రాజులు నిర్మించారు. కాకతీయుల రాజైన గణపతి దేవునికి శివుడంటే అపారమైన భక్తి. యుద్ధాలలో తనకి అనేక విజయాలను కట్టబెట్టిన స్వామి వారి పట్ల కృతజ్ఞతతో ఆయన ఈ ఆలయాన్ని నిర్మించినట్టు చెబుతారు.

గణపతిదేవుడు కాలంలో కూసుమంచి రామలింగేశ్వరస్వామిగా పూజలందుకున్న శివుడు, గణపతిదేవుని తరువాతి కాలంలో ఆయన పేరును కలుపుకుని ‘గణపేశ్వర స్వామి’గా ప్రసిద్ధిచెందాడు. గణపేశ్వరాలయం కూసుమంచి బస్ స్టాండ్ నుండి 1.7 కి.మీ దూరంలో ఉంది. కాకతీయులు రాజ్య అవసరాల కోసం, ఆధ్యాత్మిక ప్రశాంతత కోసం నిర్మించిన ఆలయాలలో ఒకానొక పురాతన చారిత్రక ఆధారమే ఈ కూసుమంచి గణపేశ్వరాలయం.

ఈ ఆలయంలో ప్రకటితమయ్యే కాకతీయుల శిల్పరీతి అతి ప్రాచీనమైనదే కాకుండా అత్యంత విశిష్టమైనది కూడా! ఈ ఆలయ నిర్మాణంలో సిమ్మెంటు సున్నం వంటి పదార్దాలు వాడకుండా కేవలం రాళ్లను అనుసంధానం అంటే ఇంటర్ లాకింగ్ విధానంలో నిర్మించడం విశేషం. పెద్ద పెద్ద రాళ్లకు గాడులూ, కూసాలు పద్ధతిలో బిగింపు చేయడం ద్వారా ఆలయాన్ని మొత్తం నిర్మించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News