Homeనల్లగొండHuzurnagar SI Suspended | చోరీ బైక్ అప్పగింత వ్యవహారంలో ట్విస్ట్...

Huzurnagar SI Suspended | చోరీ బైక్ అప్పగింత వ్యవహారంలో ట్విస్ట్…

  • హుజూర్‌నగర్ ఎస్ఐపై సస్పెన్షన్ వేటుHuzurnagar SI Suspended
  • నిబంధనలకు విరుద్ధంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ వాహనాన్ని ఇతరులకు అప్పగించిన వైనం

చోరీ కేసులో రికవరీ చేసిన బుల్లెట్ బైక్ ను నిబంధనలకు విరుద్ధంగా వేరొకరికి అప్పగించారన్న ఆరోపణలపై హుజూర్‌నగర్ ఎస్ఐ చలికంటి నరేష్ సస్పెండ్ అయ్యారు.పోలీసు శాఖలో కలకలం రేపిన ఈ ఘటనపై విచారణ జరిపిన సూర్యాపేట జిల్లా ఎస్పీ కె. నరసింహ సస్పెన్షన్ ఉత్తర్వులు సోమవారం జారీ చేశారు.పూర్తి వివరాల్లోకి వెళితే…ఇటీవల హైదరాబాద్‌లోని వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ బైక్ చోరీకి గురైంది. కేసు నమోదు చేసుకున్న వనస్థలిపురం పోలీసులు సాంకేతిక ఆధారాల సాయంతో ఆ బైక్ హుజూర్‌నగర్‌లో ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.Huzurnagar SI Suspended

అయితే స్థానిక నాయకుల ఒత్తిడి కారణంగా హుజూర్‌నగర్ ఎస్ఐ నరేష్ నిబంధనలను పక్కనపెట్టి ఆ బైక్‌ను మరో వ్యక్తికి తిరిగి అప్పగించారనే ఆరోపణలు వచ్చాయి.ఈ వ్యవహారంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన వనస్థలిపురం పోలీసులు జరిగిన ఘటనపై సూర్యాపేట జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. మరోవైపు ఈ ఘటన సోషల్ మీడియాలోనూ వైరల్ కావడంతో ఉన్నతాధికారులు సీరియస్‌గా స్పందించారు. ఎస్పీ ఆదేశాలతో చేపట్టిన ప్రాథమిక విచారణలో ఎస్ఐ నిర్లక్ష్యం, విధి నిర్వహణలో నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో ఎస్ఐ నరేష్‌ను సస్పెండ్ చేస్తూ ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. స్టేషన్‌లో ఉండాల్సిన చోరీ వాహనం వ్యవహారం ఏకంగా ఎస్ఐ సస్పెన్షన్‌కు దారితీయడం స్థానికంగా చర్చనీయాంశమైంది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES

Latest News