HomeUncategorizedVaikuntha Chaturdashi | విశిష్టమైన వైకుంఠ చతుర్థి..

Vaikuntha Chaturdashi | విశిష్టమైన వైకుంఠ చతుర్థి..

  • శివుడు, విష్ణుమూర్తిని ఒకేసారి పూజించే పర్వదినం..Vaikuntha Chaturdashi
  • కార్తీక మాసంలోని శుక్ల పక్ష చతురదశి తిథి రోజు పండుగ..

హిందూ సంప్రదాయంలో వైకుంఠ చతుర్దశికి (Vaikuntha Chaturdashi) ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. శివుడు, విష్ణుమూర్తిని ఒకేసారి పూజించే ఈ పర్వదినాన్ని హరి-హర మిలన్ అని కూడా పిలుస్తారు. 2026లో వైకుంఠ చతుర్దశి నవంబర్ 23, సోమవారం నాడు జరుపుకోనున్నారు. కార్తీక మాసంలోని శుక్ల పక్ష చతుర్దశి తిథి రోజున ఈ పండుగ వస్తుంది. ఈ రోజున శివ, విష్ణువులను భక్తిశ్రద్ధలతో పూజిస్తే దైవానుగ్రహం లభిస్తుందని భక్తుల విశ్వాసం.

ఈ రోజున తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి పూజకు సిద్ధం కావాలి. విష్ణుమూర్తికి తులసి ఆకులు, శివుడికి బిల్వ పత్రాలు సమర్పించడం ఆనవాయితీ. ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’, ‘ఓం నమః శివాయ’ మంత్రాలను జపించవచ్చు. విష్ణు సహస్రనామం, శివ చాలీసా వంటి స్తోత్రాలను పఠించడం కూడా శుభప్రదంగా భావిస్తారు. సాయంత్రం లేదా రాత్రి సమయంలో ఇంట్లో లేదా ఆలయంలో 14 దీపాలు వెలిగించడం, పేదలకు అన్నదానం చేయడం, వస్త్రాలు, నువ్వులు, బెల్లం, నెయ్యి, పండ్లు వంటి వాటిని దానం చేయడం మంచిదని విశ్వాసం.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News