- ముఖ్యఅతిథిగా హాజరైన కోదాడ ఎమ్మెల్యే నలమాద పద్మావతి రెడ్డి….Shambhu Lingeswara Temple
సూర్యాపేట జిల్లా మేళ్ళ చెరువు మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన స్థానిక స్వయంభు శ్రీ శంభు లింగేశ్వర స్వామి వారి దేవాలయ అభివృద్ధి నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ మహోత్సవం సోమవారం అత్యంత భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కోదాడ నియోజకవర్గ శాసనసభ్యురాలు నలమాధ పద్మావతి రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యక్రమాన్ని శోభాయమానం చేశారు.ఆలయ ప్రాంగాణానికి విచ్చేసిన ఎమ్మెల్యే పద్మావతి రెడ్డికి ఆలయ అర్చకులు,వేద పండితులు పూర్ణకుంభంతో సాంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికారు.Shambhu Lingeswara Temple
అనంతరం వారు గర్భాలయంలోని శ్రీ స్వయంభు శంభు లింగేశ్వర స్వామి వారిని దర్శించుకుని నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు,అభిషేకాలు నిర్వహించారు. అర్చకులు వారికి తీర్థప్రసాదాలు అందించి వేదాశీర్వచనం చేశారు. తదుపరి ఆలయ ప్రహంగానంలో ఏర్పాటుచేసిన వేదికపై నూతన ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ కందుల సురేష్ మరియు సభ్యులు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కమిటీ చైర్మన్ మరియు సభ్యులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న శ్రీ స్వయంభు శంభు లింగేశ్వర స్వామి ఆలయ ఖ్యాతిని మరింత ఇనుమడింప చేయాల్సిన బాధ్యత నూతన కమిటీపై ఉందని అన్నారు.
భక్తులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడంతోపాటు ఆలయ సమగ్ర అభివృద్ధికి కమిటీ సభ్యులందరూ ఎలాంటి విభేదాలకు తావు లేకుండా సమిష్టి కృషితో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఆలయ అభివృద్ధికి తన వంతు పూర్తి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని కోదాడ ఎమ్మెల్యే నలమాద పద్మావతి రెడ్డి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. అనంతరం నూతన దేవాలయ చైర్మన్ కందుల సురేష్ మాట్లాడుతూ దేవాలయ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని అన్నారు. దేవాలయాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి యాత్రికా స్థలంగా మార్చేందుకు అభివృద్ధి ప్రదాత, మంత్రివర్యులు నలమాత ఉత్తంకుమార్ రెడ్డిసహాయ సహకారాలతో శక్తివంచన లేకుండా పనిచేసి దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో ఈఓ నాగేళ్ల శం,దేవస్థానం అర్చకులు,స్థానిక ప్రజా ప్రతినిధులు,ఆలయ సిబ్బంది,వివిధ గ్రామాల భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
