Homeకరీంనగర్Godavarikhani Murder Case | స్నేహమే శత్రువై.. కత్తులతో దాడి చేసి దారుణ హత్య!

Godavarikhani Murder Case | స్నేహమే శత్రువై.. కత్తులతో దాడి చేసి దారుణ హత్య!

  • 12 గంటల్లోనే నిందితులను అరెస్టు చేసిన వన్ టౌన్ పోలీసులుGodavarikhani Murder Case
  • రౌడీషీటర్లపై ఉక్కుపాదం మోపుతాం: పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి హెచ్చరిక

పాత కక్షలు, వ్యక్తిగత విభేదాలతో ఒకప్పటి స్నేహితులే కాలయములై ఒకరి ప్రాణం తీసిన ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో కలకలం రేపింది. అయితే, ఈ సంచలన హత్య కేసును వన్ టౌన్ పోలీసులు కేవలం 12 గంటల్లోపే ఛేదించి నలుగురు నిందితులను కటకటాల్లోకి నెట్టారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
మాటువేసి.. కత్తులతో మూకుమ్మడి దాడిGodavarikhani Murder Case

మృతుడు అట్ల రాజశేఖర్,ప్రధాన నిందితుడు (ఆటో డ్రైవర్) ఎన్నం ప్రసాద్ గతంలో సన్నిహితంగా ఉండేవారు. అయితే గత ఆరు నెలలుగా వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తి, ఫోన్‌లో పరస్పరం దూషించుకునే స్థాయికి చేరాయి. దీంతో రాజశేఖర్‌పై కక్ష పెంచుకున్న ప్రసాద్.. తన స్నేహితులు ఎడ్లపల్లి శ్రవణ్ కుమార్,ఐలి దేవేందర్, బోరే మల్లేష్‌లతో కలిసి హత్యకు పథకం రచించాడు.ఈ నెల 22న రాత్రి బృందావన్ గార్డెన్స్‌లో ఓ కార్యక్రమానికి హాజరైన నిందితులు,ఆ తర్వాత పవర్ హౌస్ కాలనీలోని బాలయ్య కిరాణం ఎదురుగా మాటువేశారు.తెల్లవారుజామున 1:10 గంటల సమయంలో బైక్‌పై ఇంటికి వెళ్తున్న రాజశేఖర్‌ను అడ్డగించి కత్తులతో విచక్షణారహితంగా పొడిచి హత్య చేశారు. మృతుడి తండ్రి అట్ల మల్లయ్య ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు.
బూడిదను గోదావరిలో కలిపినా.. తప్పించుకోలేకపోయారు

- Advertisement -

హత్య అనంతరం నిందితులు రక్తపు మరకలున్న దుస్తులను కాల్చివేసి, ఆ బూడిదను గోదావరి నదిలో కలిపి సాక్ష్యాలను మాయం చేసే ప్రయత్నం చేశారు. అనంతరం ఆటోలో కాల్వ శ్రీరాంపూర్ వైపు పారిపోతుండగా, పక్కా సమాచారంతో వన్ టౌన్ పోలీసులు 5 ఇంక్లైన్ చౌరస్తా వద్ద వారిని చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు.నిందితుల నుంచి నేరానికి వాడిన ఆటో (TG-22-T-2866), రెండు కత్తులు,మూడు సెల్‌ఫోన్లు,రక్తపు మరకలున్న టీ-షర్టును స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.
అసాంఘిక శక్తులకు డీసీపీ హెచ్చరిక

శాంతిభద్రతలకు విఘాతం కలిగించే రౌడీషీటర్లు, అసాంఘిక శక్తులపై నిరంతర నిఘా ఉంటుందని డీసీపీ రామ్ రెడ్డి స్పష్టం చేశారు. వ్యక్తిగత కక్షలను హింసాత్మకంగా పరిష్కరించుకోవాలని చూస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.కేసును వేగంగా ఛేదించిన గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్,వన్ టౌన్ ఇంచార్జ్ సీఐ లింగమూర్తి,ఎస్సైలు మనోహర్,రాజశేఖర్,హెడ్ కానిస్టేబుల్ సదయ్య,కానిస్టేబుళ్లు బి.ప్రకాష్,ఐ.రమేష్,మధుకర్, మధుసూదన్‌లను డీసీపీ ప్రత్యేకంగా అభినందించారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News