HomeసినిమాMeenakshi Chaudhary | నాకు ఎవరిమీద క్రష్ లేదు..

Meenakshi Chaudhary | నాకు ఎవరిమీద క్రష్ లేదు..

  • నా జీవితమే క్రష్ అయ్యింది..Meenakshi Chaudhary
  • వ్యక్తిగత జీవితానికి టైం లేకపోయింది..

టాలీవుడ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) తనదైన చలాకీ మాటలతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నాగచైతన్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘వృషకర్మ’ ప్రమోషన్లలో చురుగ్గా పాల్గొంటున్న ఆమె, తన వ్యక్తిగత జీవితంపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. సినిమా ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో యాంకర్… ‘ప్రస్తుతం మీకు ఎవరిపైనైనా క్రష్ ఉందా?’ అని మీనాక్షిని ప్రశ్నించారు. దీనికి ఆమె ఏమాత్రం తడుముకోకుండా నవ్వుతూ బదులిచ్చారు. “నాకు ఎవరిపైనా ఎలాంటి క్రష్ లేదు.. అసలు నా జీవితమే క్రష్ అయిపోయింది” అంటూ చమత్కరించారు. వరుస ప్రాజెక్టులు, తీరికలేని షూటింగులు, ప్రమోషన్స్ వల్ల వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయించలేకపోతున్న విషయాన్ని ఆమె ఈ విధంగా సరదాగా వివరించారు.

అలాగే ప్రేమ, రిలేషన్‌షిప్‌లపై అడిగిన మరో ప్రశ్నకు స్పందిస్తూ.. “నాకు తెలియదు కానీ.. ప్రేమలో పడటం, బ్రేకప్ నుంచి బయటపడటం రెండూ కష్టమే” అని మీనాక్షి వ్యాఖ్యానించారు. ‘లక్కీ భాస్కర్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి విజయాలతో మంచి జోరుమీదున్న ఈ బ్యూటీ, ప్రస్తుతం తన పూర్తి దృష్టిని సినిమాలపైనే పెట్టినట్లు స్పష్టమవుతోంది. కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర మరియు సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘వృషకర్మ’ డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్ర ట్రైలర్‌ను నవంబర్ 25న నెల్లూరులో ఘనంగా విడుదల చేసేందుకు చిత్ర బృందం ఏర్పాట్లు చేస్తోంది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES

Latest News