Homeక్రైమ్ వార్తలుFood Safety Raids | బయట ఫుడ్ తింటున్నారా..?

Food Safety Raids | బయట ఫుడ్ తింటున్నారా..?

  • అయితే మీ పని గోవిందా..?Food Safety Raids
  • ఒక్కసారి ఈ స్టోరీ చదవండి..

ఔట్‌ సైడ్‌ ఫుడ్‌ ఎప్పుడైనా.. అవుట్ సైడే. అందుకే తప్పని పరిస్థితులో తప్ప ఎప్పుడూ బయటిఫుడ్‌ను తినకపోవడమే ఉత్తమం అని అధికారుల దాడులను (Food Safety Raids) చూస్తే అర్దమవుతుంది. జిహ్వ చాపల్యాన్ని అదుపులో పెట్టుకోవడమే బెటర్‌ అనుకునేలా ఉంది. అవును పైకి అట్టహాసంగా కనిపించే హోటళ్లు, రెస్టారెంట్‌లో కూడా కనీస నాణ్యత ప్రమాణాలను పాటించకపోవడం ఫుడ్‌ప్రియులను కలవరపడేలా చేస్తోంది. ఇటీవల కాలంలో కొన్నిచోట్ల ఫుడ్‌సేఫ్టీ అధికారులు నిర్వహించిన దాడులను చూస్తే బయట ఆహారానికి ఎంత దూరం ఉంటే అంత బెటర్‌ అన్న ఆలోచన కలిగేలా చేస్తోంది. ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లపై ఫుడ్‌ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించగా.. విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి.

కస్టమర్లకు వేడివేడిగా వండిస్తున్న ఆహారపదార్ధాలు.. ఫ్రెష్‌గా వండినవి కావని గుర్తించారు. నిల్వ చేసిన ఆహార పదార్ధాలనే వేడి చేసి సర్వ్‌ చేస్తున్నట్టు తెలుసుకున్నారు. వెజ్‌ బిర్యానీ సహా, పన్నీర్‌ టిక్కా, చట్నీ, సమోసా వంటి పదార్ధాలు కూడా నిల్వ చేసినవే ఉన్నాయి. ఆరుగంటల కంటే ఎక్కువ నిల్వ చేసి వడ్డించకూడదన్న నిబంధనలను చాలా హోటళ్లు, రెస్టారెంట్లు తుంగలో తొక్కుతున్నాయని అధికారులు తెలిపారు. ఇలాంటి ఆహార పదార్ధాలను వేడి చేసి సర్వ్‌ చేస్తే ఆరోగ్యంపై తీవ్ర దుష్ర్రభావం చూపుతాయని హెచ్చరిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన కొన్ని హోటళ్లను అధికారులు మూసివేశారు. మరికొన్ని హోటళ్లకు షోకాజు నోటీసులు ఇచ్చారు. ఇంకొన్ని వాటికి ఇంప్రూమ్‌మెంట్‌ నోటీసులను జారీ చేశారు. ఈ దాడుల్లో FSSAI గడువు ముగిసిన హోటళ్లు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. వెజ్‌, నాన్‌వెజ్‌.. వంటకం ఏదైనా తినేముందు ఆలోచించాలని, రెస్టారెంట్లలో అనేక లోపాలున్నట్టు అధికారులు హెచ్చరిస్తున్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News