Homeరంగారెడ్డిKandlakoya Lake | కండ్లకోయ చెరువులో కలుషిత నీరు

Kandlakoya Lake | కండ్లకోయ చెరువులో కలుషిత నీరు

  • చేపలు మృత్యువాత మత్స్యకారుల ఆందోళన..

మేడ్చల్: మేడ్చల్ సర్కిల్ పరిధిలోని కండ్లకోయ చెరువులోకి(Kandlakoya Lake) కలుషిత నీరు చేరడంతో(Polluted Water) వందల సంఖ్యలో చేపలు మృత్యువాత పడుతున్నాయి. చెరువుపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్న మత్స్యకారులు ఈ పరిణామంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కండ్లకోయ గ్రామంలోని పలు అపార్ట్‌మెంట్లు, హాస్టల్ భవనాల నుంచి వెలువడుతున్న మురుగునీరు నేరుగా చెరువులో కలుస్తుండటంతో నీరు కలుషితమై చేపలు చనిపోతున్నాయని వారు ఆరోపిస్తున్నారు.

దీంతో మత్స్యకార కుటుంబాలు ఆర్థికంగా నష్టపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి చెరువులోకి మురుగునీరు చేరకుండా చర్యలు తీసుకోవడంతో పాటు, నష్టపోయిన మత్స్యకారులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కందాడి నరేందర్ రెడ్డి, పెంటయ్య, రాజేందర్, శివ తదితరులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News