- లైన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఎవరెస్ట్, కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహణ..
లైన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఎవరెస్ట్(Lions Club Hyderabad Everest), కలాం ఫౌండేషన్(Kalam Foundation) సంయుక్త ఆధ్వర్యంలో బడంగ్ పేట్(Badangpet), లోకాయుత కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ వారి సహకారంలో ఉచిత ఆరోగ్య శిబిరం లోకాయుత కాలనీ నందు నిర్వహించడం జరిగింది. ఈ శిబిరంలో యశోద హాస్పిటల్, మలక్ పేట్ బృందము, శ్రీ నేత్రాలయం, సంతోష్ నగర్ వారి ఆధ్వర్యంలో దాదాపు 350 మందికి ఉచిత పరీక్షలు చేసి ఉచితంగా మందులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎవరెస్ట్ క్లబ్ అధ్యక్షులు లయన్ వీరస్వామి గౌడ్, సెక్రటరీ లైన్ వెంకట్ రెడ్డి, క్యాంపు చైర్మన్ లైన్ బుచ్చయ్య, కలాం ఫౌండేషన్ సెక్రటరీ వేణుధర్ రెడ్డి, లోకాయుక్త కాలనీ ప్రెసిడెంట్ బల్వంత్ రెడ్డి, కాలనీ సభ్యులు పాల్గొని విజయవంతం చేసినారు. ఈ కార్యక్రమం కాలనీ మెంబర్ చిత్రం జీవన్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
