Homeరంగారెడ్డిWomen Empowerment | మహిళలు ఎవరిమీదా ఆధార పడకుండా స్వయం కృషితో ఎదగాలి

Women Empowerment | మహిళలు ఎవరిమీదా ఆధార పడకుండా స్వయం కృషితో ఎదగాలి

  • అన్ని రంగాల్లోనూ మహిళలు రాణించాలి
  • ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని, RC పురం లో సురక్ష సేవా సంఘం ఆధ్వర్యంలో స్వయం ఊపాది శిక్షణా కేంద్రం ప్రారంభం.

సురక్ష సేవా సంఘం తెలంగాణ, ప్రొఫెసర్ జయ శంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయం అనుబంధ సంస్థ అయిన సామాజిక విజ్ఞాన కేంద్రం సైఫాబాద్ వారి సంయుక్త ఆధ్వర్యం లో రామచంద్రంపురం లోని భారతీనగర్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని స్వయం ఉపాధి శిక్షణా శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది.

Women Self Employment Training Inauguration RC Puram1

మహిళలు ఎవరి మీదా ఆధార పడకుండా స్వయకృషి తో ఎదగాలని, అన్ని రంగాల్లో రాణించాలని సురక్ష సేవా సంఘం సామాజిక విజ్ఞాన కేంద్రంతో సమిష్టిగా మహిళలు వెదురుతో బుట్టలు, గృహోపకరణ వస్తువులు, లెదర్ వస్తువుల తయారీలోనూ శిక్షణ ఇచ్చి, తయారు చేసిన వస్తువులు మార్కెట్లో ఏ విధంగా వాణిజ్యం చేయడం అనే అంశాల పై 6 రోజుల శిక్షణ శిబిరం సురక్ష సేవా సంఘం అధ్యక్షులు గోపి శంకర్ యాదవ్ ఆదేశాలు మేరకు ఈరోజు భారతీ నగర్లో శిక్షణ కేంద్రం ప్రారంభించడం జరిగింది.

- Advertisement -
Women Self Employment Training Inauguration RC Puram

ఈ కార్యక్రమం లో సురక్ష సంగారెడ్డి జిల్లా ఇంచార్జి శ్రీమతి హారతి, ప్రోగ్రాం కో ఆర్డినేటర్లు, స్కిల్ డెవలప్ మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ లు షరీన్ హిమబిందు, ,శ్రీమతిch స్నేహలత,YDC వాలంటీర్ తులసి, కాలనీ పెద్దలు, 40 మంది శిక్షణ తీసుకుంటున్న మహిళలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News