Saturday, May 2, 2026
Homeస్పోర్ట్స్Salman Ali Agha | షేక్ హ్యాండ్ ఇవ్వడానికే వెళ్లాను..

Salman Ali Agha | షేక్ హ్యాండ్ ఇవ్వడానికే వెళ్లాను..

  • తనకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదన్న పాకిస్తాన్ కెప్టెన్..

గ‌త ఏడాది ఆసియాక‌ప్‌లో భార‌త‌, పాక్ కెప్టెన్లు షేక్‌హ్యాండ్ ఇచ్చుకోని విష‌యం తెలిసిందే. ఆ వివాదంపై పాకిస్థాన్ కెప్టెన్ స‌ల్మాన్ ఆఘా మ‌రికొన్ని విష‌యాల‌ను వెల్ల‌డించాడు. ఆఘా మాట్లాడిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న‌ది. పెహ‌ల్గామ్ ఉగ్రదాడి నేప‌థ్యంలో పాక్ ఆట‌గాళ్ల‌తో క‌ర‌చాల‌నం చేసేందుకు ఇండియా నిరాక‌రించింది. కానీ ఆసియా క‌ప్ ట్రోఫీని ప‌రిచ‌యం చేసేందుకు ఆట‌గాళ్ల ఫోటోషూట్ జ‌రిగింద‌ని, ఆ స‌మ‌యంలో కెప్టెన్లు షేక్‌హ్యాండ్ ఇచ్చుకున్న‌ట్లు స‌ల్మాన్ ఆఘా తెలిపాడు.

ఇండోపాక్ మ్యాచ్ రోజున‌.. టాస్ వేయడానికి కొన్ని క్ష‌ణాల ముందు త‌న‌కు హ్యాండ్‌షేక్ గురించి తెలిసింద‌ని ఆఘా అన్నాడు. మీడియా మేనేజ‌ర్ న‌యీమ్ భాయ్‌తో క‌లిసి టాస్‌కు వెళ్లాన‌ని, ఆ స‌మ‌యంలో మ్యాచ్ రిఫ‌రీ త‌న‌ను ఓ ప‌క్క‌కు తీసుకెళ్లాడ‌ని, హ్యాండ్‌షేక్ ఉండ‌ద‌ని చెప్పాడ‌న్నాడు. హ్యాండ్‌షేక్ లేకున్నా ప‌ర్వాలేద‌ని అభిప్రాయ‌ప‌డ్డాన‌ని, ఆ విష‌యంలో తానేమీ శ్ర‌ద్ధ‌పెట్ట‌లేద‌ని ఆఘా అన్నాడు. హ్యాండ్‌షేక్ ఉండ‌బోద‌న్న విష‌యాన్ని త‌న‌కు తొలుత మ్యాచ్ రిఫ‌రీ చెప్పిన‌ట్లు ఆఘా పేర్కొన్నాడు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News