Sunday, April 26, 2026
Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | పుస్తకం హస్తభూషణం!

Aaj Ki Baath | పుస్తకం హస్తభూషణం!

పుస్తకం హస్తభూషణం! ఆ హస్తంలోకి సెల్ ఫోన్ వచ్చిచేరింది నేడు.. అది పుస్తకాన్ని హైజాక్ చేసి మనిషిని తన కౌగిట్లో బంధించుకుంది. ఆధునిక జ్ఞానానికి నిలువెత్తు సాక్ష్యం పుస్తకమే.. అది ఒత్తిడిని తగ్గించి, ఊహాశక్తిని పెంచుతోంది. మనిషి ఎదుగుదలకు మార్గదర్శనం చేస్తుంది. ఈ డిజిటల్ (ఏఐ) యుగంలోనూ పుస్తకం అవసరం ఎంతో ఉంది. ఆలోచనల యుద్ధంలో పుస్తకాలే అసలైన అస్త్రాలు.. మనం పుస్తకాన్ని వదిలేస్తే ఆలోచనలు మనల్ని వదిలేస్తాయి! మనం చదవడాన్ని మానేస్తే –సృజనాత్మకతను కోల్పోతాం! నేటి మిత్రులు రేపటి శత్రువులు కావచ్చు? తన బిడ్డలే తనను కాదనవచ్చు.. నమ్మినవారు మోసం చేయవచ్చు. కానీ ఈ లౌకిక ప్రపంచంలో నమ్మదగిన నేస్తాలు పుస్తకాలే. కాబట్టి ‘చినిగిన చొక్కానైనా తొడుక్కో కానీ ఓ మంచి పుస్తకం కొనుక్కో.. అన్నట్లు సోషల్ మీడియాలో కాలం వృధా చేయకుండా పుస్తక పఠనం వైపు మళ్లించేందుకు ప్రతిన బూనుదాం..

  • మేదాజీ
- Advertisement -
RELATED ARTICLES

Latest News