Homeహైదరాబాద్‌Sadar Sammelanam | ఎన్టీఆర్ గార్డెన్స్‌లో ఘనంగా సదర్ సమ్మేళనం

Sadar Sammelanam | ఎన్టీఆర్ గార్డెన్స్‌లో ఘనంగా సదర్ సమ్మేళనం

  • ముఖ్య అతిథులుగా పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, ఆర్జేడీ అధినేత తేజస్వి యాదవ్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్

హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ గార్డెన్స్‌లో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో సదర్ సమ్మేళనం(Sadar Sammelanam) ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి, బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత శ్రీ తేజస్వి యాదవ్, టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శ్రీ మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సదర్ సమ్మేళనంలో యాదవ సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సంప్రదాయాలు, సంస్కృతి, ఐక్యతకు ప్రతీకగా నిలిచే సదర్ ఉత్సవాలు ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు హనుమంతరావు,మంత్రి పొన్నం ప్రభాకర్, పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యాదవ సంఘాల ప్రతినిధులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News