కిషోర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మాత ఎన్.ఎన్. కిషోర్ నిర్మిస్తున్న తొలి చిత్రం ప్రొడక్షన్ నెంబర్ 1 ఘనంగా ప్రారంభమైంది.(Film Launch)బుధవారం ఉదయం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో సినీ ప్రముఖులు, అతిథుల సమక్షంలో ఈ సినిమా పూజా కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి. వినాయక్, ప్రామిసింగ్ హీరో ఆది సాయికుమార్ ముఖ్య అతిథులుగా విచ్చేయడంతో ప్రారంభోత్సవ వేడుక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వి.వి. వినాయక్ చిత్ర బృందానికి స్క్రిప్ట్ అందజేసి శుభాకాంక్షలు తెలియజేయగా.. ముహూర్తపు షాట్‌కు నిర్మాత ఎన్.ఎన్. కిషోర్ క్లాప్ కొట్టారు. ఆది సాయికుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేసి చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు.

ఈ ప్రారంభోత్సవ వేడుకకు ప్రముఖ నిర్మాత మల్కాపురం శివకుమార్, సిద్ధు రెడ్డి, చీకోటి ప్రవీణ్ ముఖ్య అతిథులుగా హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. వీరితో పాటు పలువురు సినీ ప్రముఖులు, నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, సన్నిహితులు పాల్గొని చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలియజేశారు.
దర్శకులు రవికుమార్ చౌదరి, ఘటికాచలం వద్ద రచయితగా అసోసియేట్‌గా పనిచేసిన దివాకర్ యడ్ల ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఓ అందమైన ప్రేమకథతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే వినోదాత్మక అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ‘డెలులు’ చిత్రంతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న విజయ్ రాజ్ కుమార్ హీరోగా నటిస్తుండగా.. కన్నడ చిత్రం ‘కేజీయఫ్’లో యశ్ తల్లిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న అర్చనా జోయస్ హీరోయిన్గా నటిస్తున్నారు. ‘అర్జున్ రెడ్డి’, ‘అమీతుమీ’ వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అతిథి మైకల్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.

ఈ ప్రారంభోత్సవం సందర్భంగా దర్శకుడు దివాకర్ యడ్ల మాట్లాడుతూ.. ‘‘ప్రేమ అంటే రెండు మనసుల మధ్య పుట్టే ఒక అందమైన అనుభూతి. ఆ అనుభూతిని నిజాయతీగా, హృదయానికి హత్తుకునేలా తెరపై చూపించాలన్నదే మా ప్రయత్నం. ఈ సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు తన జీవితంలోని మధుర క్షణాలను ఒక్కసారి గుర్తు చేసుకుంటారు. యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులందరికీ నచ్చేలా ఆద్యంతం ఆహ్లాదంగా సాగే చిత్రంగా దీనిని తీర్చిదిద్దుతున్నాం. హైదరాబాద్, కేరళలో షూటింగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేశాం. ఈ సినిమాకు కథే అసలైన హీరో. నాపై నమ్మకంతో అవకాశం ఇచ్చిన నిర్మాత ఎన్.ఎన్. కిషోర్ గారికి, నటీనటులకు, సాంకేతిక నిపుణులకు కృతజ్ఞతలు. మా సినిమా ప్రారంభోత్సవానికి విచ్చేసి ఆశీర్వదించిన సినీ ప్రముఖులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రేక్షకుల ఆదరణే మాకు అసలైన బలం’’ అని అన్నారు.

నిర్మాత ఎన్.ఎన్. కిషోర్ మాట్లాడుతూ..‘‘సినిమా అంటే మాకు ప్రాణం. ఆ ప్రేమతోనే కిషోర్ మూవీ మేకర్స్ బ్యానర్‌ను ప్రారంభించాం. మా తొలి చిత్రం ఇంతమంది సినీ పెద్దల ఆశీస్సుల మధ్య ప్రారంభం కావడం ఎంతో ఆనందంగా ఉంది. అదే సమయంలో మాపై మరింత బాధ్యతను పెంచింది. మంచి కథ, నాణ్యమైన నిర్మాణ విలువలతో ప్రేక్షకుల మనసులు గెలుచుకునే చిత్రాన్ని అందించడమే మా లక్ష్యం.

దర్శకుడు దివాకర్ చెప్పిన కథపై మాకు పూర్తి నమ్మకం ఉంది. ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తాం. ముఖ్య అతిథులుగా విచ్చేసిన వి.వి. వినాయక్ గారు, ఆది సాయికుమార్ గారు, మల్కాపురం శివకుమార్ గారు, చీకోటి ప్రవీణ్ గారితో పాటు మమ్మల్ని ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. కొత్త ప్రతిభను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మా బ్యానర్‌పై మరిన్ని సినిమాలు నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నాం. మీ ఆశీస్సులు, ప్రేక్షకుల ఆదరణ ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను’’ అని తెలిపారు.
హీరో విజయ్ రాజ్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘ఇదొక కంప్లీట్ ఎంటర్టైనర్. దర్శకుడు దివాకర్ గారు మంచి కథను సిద్ధం చేశారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడం చాలా సంతోషంగా ఉంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌కు కూడా నచ్చేలా ఈ సినిమా రూపొందనుంది” అని చెప్పారు.

హీరోయిన్ అర్చనా జోయస్ మాట్లాడుతూ..‘‘కన్నడలో ఇప్పటికే పలు సినిమాల్లో నటించాను. ‘కేజీయఫ్’ చిత్రంలో యశ్ తల్లిగా నటించడం ద్వారా నాకు మంచి గుర్తింపు వచ్చింది. తెలుగు ప్రేక్షకులు కూడా నన్ను ఎంతో ఆదరించారు. ఇప్పుడు ఈ చిత్రంతో స్ట్రెయిట్ తెలుగు సినిమాలో హీరోయిన్గా నటించడం చాలా సంతోషంగా ఉంది. మంచి టీమ్‌తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది” అని తెలిపారు.
అతిథి మైకల్ మాట్లాడుతూ..‘‘మంచి కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. దర్శకుడు దివాకర్ మంచి కథతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది” అని అన్నారు.
సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి. వినాయక్, హీరో ఆది సాయికుమార్‌తోపాటు సినీ ప్రముఖుల ఆశీస్సుల మధ్య ఘనంగా ప్రారంభమైన కిషోర్ మూవీ మేకర్స్ తొలి చిత్రం ప్రొడక్షన్ నెంబర్ 1పై ప్రారంభం నుంచే ఆసక్తి నెలకొంది. ప్రేమకథకు వినోదం, భావోద్వేగాలను జోడించి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోనుంది. హైదరాబాద్, కేరళలో చిత్రీకరణ జరుపుకోనున్న ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
చిత్ర వివరాలు
బ్యానర్ : కిషోర్ మూవీ మేకర్స్
నిర్మాత : ఎన్.ఎన్. కిషోర్
దర్శకత్వం : దివాకర్ యడ్ల
నటీనటులు : విజయ్ రాజ్ కుమార్, అర్చనా జోయస్, అతిథి మైకల్
సినిమాటోగ్రఫీ : కె.కె. రావు
సంగీతం : సుధా శ్రీనివాస్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : శ్రీనివాస్ కె. నాయుడు
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ : ఆర్.వి. రామకృష్ణ
పీఆర్వో : జీకే మీడియా (గణేష్, కుమార్)
