Homeహైదరాబాద్‌Chintala Lakshmi Narayana | నూతన విద్యా విధానానికి స్వాగతం

Chintala Lakshmi Narayana | నూతన విద్యా విధానానికి స్వాగతం

  • బాలల హక్కుల పరిరక్షణ వేదిక
  • దేశంలో ఇప్పటికే అనేక రాష్టాల్లో అమలు
  • డ్రాప్ ఔట్లు తగ్గుతాయని ఆశాభావం
  • జిల్లా కార్యదర్శి చింతల లక్ష్మి నారాయణ

అడ్డగుట్ట: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా విధానంలో తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు బాలల హక్కుల పరిరక్షణ వేదిక హైదరాబాద్ జిల్లా కార్యదర్శి చింతల లక్ష్మీనారాయణ(Chintala Lakshmi Narayana) తెలిపారు. ఈ విద్యా విధానం దేశంలో నాలుగు రాష్ట్రాలు మినహా అన్ని రాష్ట్రాల్లో కొనసాగుతుందని శనివారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. ఈ విద్యా విధానం(New Education Policy) ద్వారా ప్రతి మండలానికి నాలుగు స్కూళ్లలో సీనియర్ సెకండరీ విధానాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు.

రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో 9 ప్లస్ 12 విధానం వల్ల ప్రభుత్వ పాఠశాలలో డ్రాప్ అవుట్ తగ్గుతుందని, పేద పిల్లలకు ముఖ్యంగా ఆడపిల్లలకు ఉన్నత విద్య కొనసాగించే అవకాశం ఉంటుందని, ప్రైవేటు పాఠశాలలో, కాలేజీలలో ఫీజుల దోపిడిని అరికట్టే అవకాశం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

- Advertisement -

ఈ క్రమంలో ప్రైవేట్ పాఠశాలలు, కాలేజీలలో ఫీజుల పట్టికను ఏర్పాటు చేయాలని, నర్సరీ నుండి 4 ప్రాథమిక విద్య, 5 నుండి 8 సెకండరీ విద్య 9 నుండి 12వ తరగతి వరకు సీనియర్ సెకండరీ విద్య అమలు చేసే ముందు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులతో పాటు ఉపాధ్యాయులను నియమించాల్సిన అవసరం ఉందని చెప్పారు. మౌలిక వసతుల కల్పనలో లోపం, అధ్యాపకుల కొరత కారణంగానే రాష్ట్ర విద్యా వ్యవస్థ విద్యా ప్రమాణాల్లో దేశంలోనే 35 వ స్థానంలో ఉందని గుర్తు చేశారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇప్పటివరకు రాష్ట్రంలో ఏడు పాఠశాలలు మాత్రమే ఏర్పాటు చేశారని, ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం క్యూర్ బిల్లులో ప్రవేశపెడుతున్న క్రమంలో జనాభా ప్రాతిపదికన ప్రభుత్వ పాఠశాలలు ఏర్పాటు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం విద్యకి ఇచ్చిన హామీలలో 15% విద్యా బడ్జెట్ అందించాలని డిమాండ్ చేశారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News