Tuesday, April 14, 2026
Homeక్రైమ్ వార్తలుAttack | డబ్బు ఇవ్వనందుకు హిజ్రాల దాడి

Attack | డబ్బు ఇవ్వనందుకు హిజ్రాల దాడి

హిజ్రాలు (Hijras) ఓ కుటుంబంపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటన కీసర మండలంలోని చీర్యాల గ్రామంలో చోటుచేసుకుంది. బాలాజీ ఎన్‌క్లేవ్‌లో గృహ ప్రవేశం (Homecoming) జరుగుతుండగా 15 మంది హిజ్రాలు వచ్చి రూ.లక్ష డిమాండ్ (Money Demand) చేశారు. ‘ఇవ్వను’ అన్నందుకు కుటుంబ సభ్యులను కర్రలతో కొట్టారు. దీంతో బాధితులు(Victims) పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితులు కుషాయిగూడ (Kushaiguda) పరిధి హిజ్రాలు అని పోలీసులు (Police) గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హిజ్రాలు.. శుభకార్యాలు, వ్యాపారాల వద్ద డబ్బు డిమాండ్ చేసి ఇవ్వనప్పుడు బెదిరింపుల(Warnings)కు పాల్పడటమే కాకుండా దాడులకు దిగుతుండటంపై ప్రజలు (Public) ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News