Homeఆదిలాబాద్Ramagundam Police | పశువుల రవాణాపై అప్రమత్తంగా ఉండాలి

Ramagundam Police | పశువుల రవాణాపై అప్రమత్తంగా ఉండాలి

  • పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా

బక్రీద్ సందర్భంగా పశువుల అక్రమ రవాణాపై అప్రమత్తంగా ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అధికారులనుఆదేశించారు. మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని నేషనల్ హైవే టోల్‌గేట్ వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్‌ను రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా అధికారులు, సిబ్బందికి పలు సూచనలు,ఆదేశాలు ఇచ్చి,వివరాల నమోదు రిజిస్టర్లను పరిశీలించారు.సీపీ

మాట్లాడుతూ,బక్రీద్ పండుగ సందర్భంగా పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.చెక్‌పోస్ట్ వద్ద అమలులో ఉన్న భద్రతా చర్యలను పరిశీలించి,విధుల్లో ఉన్న సిబ్బందికి పలు సూచనలు చేశారు.ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి, వాహనాలు మరియు పశువుల వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేయాలని, సంబంధిత పత్రాలు సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలించాలని ఆదేశించారు.

- Advertisement -
Ramagundam Police Cattle Transport Vigilance Bakrid5

అనుమానాస్పద వాహనాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి తెలిపారు.పండుగ సమయంలో శాంతి భద్రతలను కాపాడేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని, అనుమానాస్పద కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News