తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు (Telangana Jagruti President) కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) చేపట్టిన జాగృతి జనం బాట (Janam Baata) ప్రస్తుతం ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలో కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో నాలుగో జిల్లా(ఆదిలాబాద్)లో జరుగుతోందని కవిత తెలిపారు. 33 జిల్లాల్లో ప్రజలను కలిసి వారి సమస్యలు (Problems) తెలుసుకునేందుకు, పరిష్కారం (Solution) చూపేందుకు జనం బాట చేపట్టినట్లు చెప్పారు. ప్రజల సమస్యలను మీడియా ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి ప్రయత్నిస్తామని అన్నారు. తాము ఎక్కడికి వెళ్లినా సమస్యలే స్వాగతం పలుకుతున్నాయని పేర్కొన్నారు.

ఆమె ఇంకా ఏమన్నారంటే..
సామాజిక తెలంగాణ (Samajika Telangana) సాధనయే మా లక్ష్యం.. మా అజెండా నచ్చిన వారికి, నచ్చని వారి కూడా స్వాగతం.. జాగృతిని బలోపేతం చేసి ప్రజల సమస్యలు తీర్చే పని చేస్తాం.. భవిష్యత్ లో ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్పలేం.. నాలుగు నెలల పాటు ప్రజలతో మమేకమైన తర్వాత నిర్ణయం తీసుకుంటాం.. ఎక్కడికి వెళ్లిన సరే సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి.. వాటిలో నాలుగు సమస్యలు పరిష్కారం చేసిన మా జన్మ ధన్యమైనట్లే.. ఆదిలాబాద్ జిల్లాలో చాలా సమస్యలు మా దృష్టికి వచ్చాయి.. వాటి పరిష్కారానికి మా వంతు ప్రయత్నం చేస్తాం.. తెలంగాణలో అన్ని సమస్యలకు రాష్ట్రమొక్కటే పరిష్కారం అనుకున్నాం.. రాష్ట్రం వచ్చాక కొన్ని సమస్యలు పరిష్కరించుకున్నాం.. కొన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం చేసుకున్నాం..
ఇంకా పరిష్కరం కానీ సమస్యలు కూడా చాలా ఉన్నాయి. వాటి గురించి ప్రజల వద్దకే వెళ్లి తెలుసుకుంటాం. సమస్యలను అర్థం చేసుకుంటాం. నేను 20 ఏళ్లుగా ప్రజా జీవితం లో ఉన్నాను. ఫీల్డ్ లో ఎంత పెద్ద ఎత్తున ప్రజలకు వద్దకు వెళ్తే అంత క్లారిటీ వస్తుంది. నిన్న ఆదిలాబాద్ లో లో పత్తి రైతుల పరిస్థితి చూస్తే చాలా బాధ అనిపించింది. పత్తి సీజన్ ఉందని, అదే విధంగా మొంథా తుపాను ఎఫెక్ట్ ఉందని ప్రజా ప్రతినిధులకు ముందే తెలుసు. ఎంపీ, ఎమ్మెల్యే సహా ఏ నాయకులు కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదు. జిల్లా కలెక్టర్ అయినా సమస్యను ప్రభుత్వం ముందు ఉంచి…ఒత్తిడి పెంచాల్సింది. పత్తి తేమ శాతం పెంచి తీసుకోవాలని నేను కలెక్టర్ గారిని కోరటం జరిగింది. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం మీద ఉన్న శ్రద్ద ప్రభుత్వానికి పత్తి రైతుల మీద లేదు.
