Homeరంగారెడ్డిArrest | శామీర్‌పేట్ తహసీల్దార్ ఏసీబీ వలలో

Arrest | శామీర్‌పేట్ తహసీల్దార్ ఏసీబీ వలలో

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట్ మండల తహసీల్దార్ టి.సుచరితను ఏసీబీ అధికారులు మంగళవారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వ్యవసాయ భూమిని నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అసెస్‌మెంట్ కింద 30 ఎకరాలకు కన్వర్షన్ చేయడానికి ఫిర్యాదుదారుని నుంచి రూ.30 లక్షల లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.

Shamirpet Tahsildar ACB Bribe Case Arrest0

ఇందులో భాగంగా రూ.2 లక్షలను ఆమె వ్యక్తిగత డ్రైవర్ వి.నాగేష్ ద్వారా స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. డ్రైవర్ వద్ద నుంచి రూ.2 లక్షల లంచం నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో తహసీల్దార్ సుచరితతో పాటు డ్రైవర్ నాగేష్‌ను అరెస్ట్ చేసి నాంపల్లి ప్రత్యేక ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తున్నట్లు అధికారులు తెలిపారు. కేసుపై మరింత దర్యాప్తు కొనసాగుతోందన్నారు. లంచం డిమాండ్ చేసిన ప్రభుత్వ ఉద్యోగులపై ఫిర్యాదు చేయడానికి ప్రజలు ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064ను సంప్రదించాలని అధికారులు సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News