Homeరంగారెడ్డిIllegal Constructions | అక్రమ నిర్మాణాలపై చర్యలు ఎప్పుడు?

Illegal Constructions | అక్రమ నిర్మాణాలపై చర్యలు ఎప్పుడు?

  • హరిదాస్‌పల్లి సర్వే నంబర్ 138

జవహర్ నగర్ జీహెచ్‌ఎంసీ పరిధిలోని హరిదాస్‌పల్లి సర్వే నంబర్ 138లో ప్రభుత్వ భూమిలో భారీ ఎత్తున అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ భూమిలో వరుసగా నిర్మాణాలు వెలుస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Haridaspally Survey No 138 Illegal Constructions1

అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సంబంధిత శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించి, ప్రభుత్వ భూమి ఆక్రమణలు జరిగి ఉంటే వెంటనే వాటిని తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.

- Advertisement -
Haridaspally Survey No 138 Illegal Constructions

అధికారుల మౌనం పలు అనుమానాలకు తావిస్తోందని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టి, అక్రమ నిర్మాణాలకు పాల్పడిన వారిపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News