తాడ్వాయి మండలంలోని నందివాడ ఉన్నత పాఠశాలలో శుక్రవారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచితంగా నోట్ బుక్స్ పంపిణీ చేశారు. సింగం వెంకటేశ్వర్ రావు తన తండ్రి హనుమంతరావు జ్ఞాపకార్థం నోట్ బుక్స్ పంపిణీ చేసినట్లు అయన తెలిపాడు ఈ కార్యక్రమంలో లయన్స్ కప్ ప్రతినిధులు దామోదర్ రావు, భుజంగం, రాము,ప్రధానోపాధ్యాయులు మాధురి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
