- పేద కుటుంబానికి అండగా మాజీ డిప్యూటీ మేయర్
- అంత్యక్రియల కోసం ఆర్థిక సహాయం అందజేత
ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు అండగా నిలుస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ గుప్త (Reddy Shetty Srinivas Gupta). జవహర్‌నగర్ కీసర సర్కిల్ పరిధిలోని కెఎన్ఆర్ కాలనీలో నివాసం ఉంటున్న పట్నాల చంద్రశేఖర్ హఠాన్మరణం చెందగా, విషయం తెలుసుకున్న శ్రీనివాస్ గుప్త బుధవారం ఆయన నివాసానికి వెళ్లి మృతదేహానికి నివాళులర్పించారు.
అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి అంత్యక్రియల కోసం ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గుప్త (Reddy Shetty Srinivas Gupta) మాట్లాడుతూ ఆపదలో ఉన్న పేద కుటుంబాలను ఆదుకోవడంలోనే నిజమైన ఆత్మసంతృప్తి లభిస్తుందని అన్నారు. జవహర్‌నగర్‌లో పేద, మధ్యతరగతి కుటుంబాలు అధికంగా నివసిస్తున్నందున వారి కష్టసుఖాల్లో తోడుగా నిలవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మానవ సేవే మాధవ సేవ అనే భావనతో తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు.
ఆపద సమయంలో మృతుడి కుటుంబానికి అండగా నిలిచి ఆర్థిక సహాయం అందించిన శ్రీనివాస్ గుప్తను కాలనీవాసులు అభినందించారు. కార్యక్రమంలో కందుల శంకర్, పండాల రాజు గౌడ్, సింగం బాలరాజ్ పటేల్, భాశెట్టి వీరేష్, ఉచ్చంతల రాములు, నంగునూరు అశోక్ గుప్తా, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. (https://epaper.aadabhyderabad.in/) (Youtube)
