Homeమహబూబ్‌నగర్‌Kasani Veeresh Mudiraj | పట్టభద్రుల పోరులో కాసాని వీరేష్ ముదిరాజ్

Kasani Veeresh Mudiraj | పట్టభద్రుల పోరులో కాసాని వీరేష్ ముదిరాజ్

  • గులాబీ వ్యూహంలో కొత్త మలుపు బీసీ నేతకే అవకాశం
  • ఇటు ఎమెల్సీ అటు ఎమ్మెల్యే రాష్ట్రంలో వేడెక్కిన రాజకీయం

మూడు జిల్లాలు.. లక్షలాది మంది పట్టభద్రులు.. ప్రతిష్టాత్మక ఎమ్మెల్సీ స్థానం.. మహబూబ్‌నగర్‌–రంగారెడ్డి–హైదరాబాద్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంపై రాజకీయ పార్టీల వ్యూహాలు ఇప్పటి నుంచే వేడెక్కుతున్నాయి. ఎన్నికల సమరం అధికారికంగా మొదలుకాకముందే అభ్యర్థుల ఎంపికపై పార్టీల్లో కసరత్తు ఊపందుకోవడంతో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇప్పటికే ఈ స్థానానికి కాంగ్రెస్ అధిష్టానం సామ రామ్మోహన్ రెడ్డి పేరును ఖరారు చేయగా.. ఈ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీఆర్‌ఎస్‌ అధిష్ఠానం.. కాసాని వీరేష్ (Kasani Veeresh Mudiraj) పేరును ఖరారు చేయాలనీ చూస్తుంది.

Kasani Veeresh Mudiraj and Graduates MLC Candidacy2 1

సామాజిక సేవా కార్యక్రమాలు, యువతతో అనుబంధం, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాల కల్పన వంటి అంశాలపై పనిచేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కాసాని వీరేష్‌ పేరును బీఆర్‌ఎస్‌ ప్రకటించనున్నట్లు గులాబీ నేతలు చెబుతున్నారు..పార్టీ అధిష్ఠానం అధికారికంగా నిర్ణయం ప్రకటించాల్సి ఉన్నప్పటికీ.. వీరేష్‌ (Kasani Veeresh Mudiraj) అభ్యర్థిత్వం పై జరుగుతున్న చర్చ ప్రస్తుతం గ్రాడ్యుయేట్‌ నియోజకవర్గ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.

- Advertisement -

నిజానికి మహబూబ్‌నగర్‌–రంగారెడ్డి–హైదరాబాద్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం… ఇది కేవలం ఒక ఎమ్మెల్సీ సీటు కాదు. విద్యావంతులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, యువత, మేధావులు తమ ఓటుతో రాజకీయ పార్టీలకు ఒక స్పష్టమైన సందేశం ఇచ్చే వేదిక. అందుకే ఈసారి ఈ స్థానం చుట్టూ రాజకీయ పార్టీల కదలికలు మొదలయ్యాయి. ఇప్పటికే బీఆర్‌ఎస్‌ అధిష్ఠానం ఈ ఎన్నికను సీరియస్‌గా తీసుకున్నట్లు పార్టీ సమావేశాల్లో..నేతలకు ఇచ్చిన దిశానిర్దేశాలు వెల్లడిస్తున్నాయి.ఇలాంటి సమయంలో కాసాని వీరేష్‌ ముదిరాజ్‌ పేరు బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా తెరపైకి తీసుకురావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది.

బీఆర్‌ఎస్‌కు ఇది సాధారణ ఎన్నిక కాదు.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు సాధారణ అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా ఉండవు. పార్టీ గుర్తు ఒక్కటే ఎన్నికను నడిపించే పరిస్థితి ఉండదు. అభ్యర్థి వ్యక్తిగత పరిచయం, పట్టభద్రులతో ఉన్న సంబంధం, ఉద్యోగ–నిరుద్యోగ సమస్యలపై అవగాహన, విద్యా రంగంపై దృష్టి, సామాజిక కార్యక్రమాల్లో భాగస్వామ్యం వంటి అంశాలు కూడా ప్రభావం చూపుతాయి.

మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్‌ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానానికి 2021లో ఏకంగా 93 మంది అభ్యర్థులు పోటీ చేశారు.అప్పుడు నమోదయిన ఓటర్ల సంఖ్య సుమారు 5.31 లక్షలు. పోలైన ఓట్లు సుమారు 3.57 లక్షలు.. ఈసారి పాత ఓటర్లతో పాటు అర్హులైన కొత్త పట్టభద్రుల నమోదు ప్రక్రియ కూడా జరుగుతోంది. 2026 నవంబర్‌ 1 నాటికి డిగ్రీ పూర్తై కనీసం మూడేళ్లు పూర్తయిన వారు అర్హులుగా నమోదు చేసుకోవచ్చని ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన సమాచారం వెల్లడిస్తోంది.ఈ సారి ఓటర్ల సంఖ్య సుమారు లక్ష ఫై చీలుకు పెరిగే అవకాశం ఉందంటూ తెలుస్తోంది..

అందుకే బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎంపిక ఇప్పుడు పార్టీలో కీలక అంశంగా మారింది. వీరేష్‌ (Kasani Veeresh Mudiraj) పేరు ప్రధానంగా వినిపించడానికి కారణం
కాసాని వీరేష్‌ ముదిరాజ్‌ పేరు ప్రధానంగా వినిపించడానికి ఆయన నిర్వహించిన సామాజిక కార్యక్రమాలు, యువతతో ఆయనకు ఉన్న అనుబంధం కారణమని తెలుస్తోంది.. కాసాని ఫౌండేషన్‌ ద్వారా కాసాని వీరేష్ (Kasani Veeresh Mudiraj) ఎన్నో ఉపాధి, సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు..ముఖ్యంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో జాబ్‌ ప్లేస్‌మెంట్‌ కార్యక్రమాలు నిర్వహించి ఎంతో మంది చదువుకున్న యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిచారు.ఆయన చేపట్టిన పలు కార్యక్రమాలు…ఆయనకున్న క్లీన్ ఇమేజ్… గ్రాడుయేట్లతో ఆయనకు ఉన్న అనుబంధం…. బీసీ నేత .. చదువుకున్న విద్యావంతుడు… ఆయనకు కలిసి వచ్చే అంశాలుగా చెబుతున్నారు..

ఇటు ఎమ్మెల్సీ.. అటు ఎమ్మెల్యే.. రాష్ట్రంలో వేడెక్కిన రాజకీయం
తెలంగాణలో రాజకీయ వాతావరణం క్రమంగా వేడెక్కుతోంది. ఒకవైపు మహబూబ్‌నగర్‌–రంగారెడ్డి–హైదరాబాద్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికపై ప్రధాన రాజకీయ పార్టీల దృష్టి పడగా.. మరోవైపు ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించిన రాజకీయ పరిణామాలు, భవిష్యత్‌ వ్యూహాలపై పార్టీల్లో చర్చలు సాగుతున్నాయి. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో రాబోయే రోజుల్లో కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందన్న చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి.

ఓటర్ల సంఖ్య, పట్టభద్రుల సమస్యలు, ఉద్యోగ–ఉపాధి అంశాలతో పాటు సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థుల ఎంపికపై ఆయా పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. ఇదే సమయంలో ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించి కూడా రాజకీయ పార్టీల్లో అంతర్గత చర్చలు కొనసాగుతున్నాయి. స్థానిక పరిస్థితులు, నాయకుల బలాబలాలు, సామాజిక సమీకరణాలు, ప్రజల్లో ఉన్న రాజకీయ అభిప్రాయాలను అంచనా వేసుకుంటూ పార్టీలు తమ వ్యూహాలను రూపొందించుకుంటున్నాయి. మొత్తంగా ఎమ్మెల్సీ ఎన్నికల కసరత్తు.. ఎమ్మెల్యే స్థానాలపై రాజకీయ లెక్కలు ఒకేసారి తెరపైకి రావడంతో తెలంగాణ రాజకీయాల్లో హీట్‌ పెరుగుతోంది. రాబోయే రోజుల్లో అభ్యర్థుల ప్రకటనలు, పార్టీల వ్యూహాలు, నాయకుల కదలికలతో ఈ రాజకీయ వేడి మరింత పెరిగే అవకాశముంది.(https://epaper.aadabhyderabad.in/) (Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News