Homeరంగారెడ్డిPadmashali Township | బెటర్‌మెంట్ చార్జీలు చెల్లించకపోతే కోర్టును ఆశ్రయిస్తాం.

Padmashali Township | బెటర్‌మెంట్ చార్జీలు చెల్లించకపోతే కోర్టును ఆశ్రయిస్తాం.

  • పద్మశాలి టౌన్‌షిప్ సొసైటీ మహాజన సభలో కీలక తీర్మానం.
  • కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలు ఘనంగా.

శ్రీ భావన ఋషి సహకార గృహ నిర్మాణ సంఘం ఆధ్వర్యంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పద్మశాలి టౌన్‌షిప్(Padmashali Township) కాలనీలో జరిగిన కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు సీత ఆంజనేయులు, కార్యవర్గ సభ్యులు, సొసైటీ సభ్యులు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం పద్మశాలి టౌన్‌షిప్‌లోని(Padmashali Township దేవాలయ ప్రాంగణంలో సొసైటీ సర్వసభ్య మహాజన సభ నిర్వహించారు. సొసైటీ అధ్యక్షుడు సీత ఆంజనేయులు అధ్యక్షతన జరిగిన ఈ సభకు సుమారు 200 మందికి పైగా సభ్యులు హాజరయ్యారు. ముందుగా కార్యదర్శి వార్షిక నివేదికను, కోశాధికారి జమా ఖర్చుల వివరాలను సభలో చదివి వినిపించారు. నివేదికలను పరిశీలించిన సభ్యులు వాటికి ఆమోదం తెలిపారు.ఈ సందర్భంగా అధ్యక్షుడు సీత ఆంజనేయులు మాట్లాడుతూ పద్మశాలి టౌన్‌షిప్‌లో మౌలిక వసతులు, అభివృద్ధి పనులు మరింత వేగంగా చేపట్టాలంటే సొసైటీలో ప్లాట్లు పొందిన సభ్యులందరూ బెటర్‌మెంట్ చార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉందన్నారు.

- Advertisement -

ఇప్పటికే పలుమార్లు సూచించినప్పటికీ బెటర్‌మెంట్ చార్జీలు చెల్లించని ప్లాట్ల విషయంలో ఇకపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని సభలో తీర్మానం ప్రవేశపెట్టారు.బెటర్‌మెంట్ చార్జీలు చెల్లించని ప్లాట్లపై కోర్టును ఆశ్రయించి, అవసరమైన న్యాయపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు ఆయా ప్లాట్ల రిజిస్ట్రేషన్లు రద్దు చేయించేలా చర్యలు చేపట్టాలని ప్రతిపాదించగా సభ్యులంతా చేతులెత్తి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.

ఈ మేరకు అక్టోబర్ నెలలో కోర్టులో కేసులు దాఖలు చేయనున్నట్లు అధ్యక్షుడు సభాముఖంగా వెల్లడించారు. పద్మశాలి టౌన్‌షిప్ అభివృద్ధికి ప్రతి సభ్యుడు సహకరించాలని, సొసైటీ నిర్ణయాలను సభ్యులంతా పాటిస్తూ బెటర్‌మెంట్ చార్జీల చెల్లింపులో సహకరించాలని కోరారు. అనంతరం సొసైటీ ఎజెండాలోని ఇతర అంశాలపై కూడా సభ్యులతో చర్చించి పలు తీర్మానాలను ప్రవేశపెట్టగా సభ ఆమోదం తెలిపింది. ఈ కార్యక్రమంలో సొసైటీ కార్యవర్గ సభ్యులు, సభ్యులు, పద్మశాలి టౌన్‌షిప్ కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/), (Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News